Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Gold and Silver Rate: బంగారం ధరలు పసిడి ప్రియులకు మళ్లీ చుక్కలు చూపిస్తున్నాయి. పసిడి ధరలు మళ్లీ క్రమంగా పుంజుకుంటున్నాయి. గత పది రోజుల్లో పతనమైన బంగారం ధరలు తిరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేుకుంటున్నాయి.
గత మూడు రోజుల్లోగా పెరిగిన బంగారం దరలు నాలుగో రోజు కూడా భారీగానే పెరిగింది. నేడు బంగారం ధరల్లో భారీ మార్పు వచ్చింది.
బుధవారంతో పోల్చితే నేడు గురువారానికి తులానికి రూ. 300 పెరిగింది. ఈ వారం వరుస సెషన్స్ లో పైపైకి వెళ్లిన బంగారం గత నాలుగు రోజుల్లోనే ఏకంగా రూ. 2100 పెరిగింది. దీంతో బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి బిగ్ షాక్ తగిలినట్లయ్యింది.
ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ల 24క్యారెట్ల బంగారం తులానికి రూ. 77వేల 950 రూపాయలు ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే 71వేల 450గా ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
రానున్న కొన్ని నెలల్లోనే బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అంతర్జాతీయ పరిణామాలు, గోల్డ్ డిమాండ్ ను బట్టి రేట్లు మారుతుంటాయి. ఇండియాలో బంగారానికి ఎప్పుటికప్పుడు డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. బంగారం ధరల్లో భారీ మార్పులు కూడా వస్తున్నాయి.
అటు వెండి ధరల్లోనూ కొన్ని రోజులుగా భారీగా తేడాలు వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే వెండి రేటు లక్ష మార్క్ ను దాటేసింది. అక్కడి నుంచి ఆప్ ట్రెండ్ లోనే నడిచిన వెండి..ట్రంప్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా తగ్గింది.
ఇక ఇవాళ హైదరాబాద్ కిలో వెండి ఒక లక్ష వెయ్యి రూపాయలు పలుకుతోంది. ఈనెల ప్రారంభం నుంచి చూస్తే వెండి రేటు బాగా పడిపోయింది. దాదాపు 5శాతం వరకు తగ్గింది.