IRAN: ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు ఎలాంటి ప్రాక్సీ ఆర్మీ అవసరం లేదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. తాము రంగంలోకి దిగితే ముసుగు సంస్థలతో అవసరం లేదని హెచ్చరించారు. అమెరికా కిరాయి మూకలుగా పనిచేస్తే అణివేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు.
PM Modi To Visit Kuwait: భారత ప్రధాని నరేంద్రమోదీ కువైట్ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి రెండు రోజులపాటు కువైట్‌లో పర్యటించనున్నారు. గత 43ఏళ్లలో భారత ప్రధాని గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారి. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ అహ్వానం మేరకు భారత్, కువైట్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటన అని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Donald Trump warning India: డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. అధిక టారిఫ్ ల పేరుతో మరోసారి వ్యాఖ్యలు చేశారు. భారత్ మనపై అధిక సుంకాలు విధిస్తే మనం కూడా అధిక సుంకాలను విధించాల్సిందే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Grorgia: జార్జియాలోని ఇండియన్ రెస్టారెంట్లో దారుణం జరిగింది. రోజంతా పనులు చేసి అలసిపోయి వచ్చి పడుకున్న తర్వాత అక్కడి సిబ్బంది నిద్రలోనే మరణించారు. మొత్తం 12 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 మంది విదేశీ పౌరులు ఉండగా..ఒకరు మాత్రమే జార్జియా పౌరుడు ఉన్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ప్రశాంతంగా నిద్రిస్తున్న సమయంలో వీరు మరణించడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం.
Syria: సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ దేశం విడిచి రష్యాకు పారిపోయాడు. తన వద్ద ఉన్న కిలోల కొద్దీ బంగారాన్ని ఎత్తుకెళ్లినట్లు చెబుతున్నారు. అస్సాద్ దేశం విడిచిపారిపోతున్న సమయంలో అతను కిలోల కొద్దీ బంగారం, లగ్జరీ కార్లు, పెద్దమొత్తంలో డాలర్లు, యూరోలు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ భారతీయుకు తీపి కబురు చెప్పారు. తాను అధ్యక్ష పదవిని చేపట్టగానే..అక్రమ వలదారులు అందర్నీ అమెరికా నుంచి వెళ్లగొట్టి, చట్టబద్ధంగా వలస వచ్చేవారికి మార్గం సులువు చేస్తానంటూ ట్రంప్ పేర్కొన్నారు.
Gold and Silver Rate: బంగారం ప్రియులకు పగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బంగారం ధరలు ప్రతిరోజూ పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ లో నేడు 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగింది. తులం రేటు రూ. 71,150 దగ్గర కొనసాగుతోంది. 24క్యారెట్ల బంగారం ధర రూ. 550 ఎగబాకి ప్రస్తుతం పది గ్రాములకు రూ. 77, 620 దగ్గర ట్రేడవుతోంది. వెండి ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ప్రస్తుతం రూ. 1.01లక్షల వద్ద ఉంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుతూనే ఉంది.
Israel-Iran War: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. అక్టోబర్ 1వ తేదీన ఇరాన్ చేసిన వైమానిక దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ ఈ దాడులు చేస్తోంది. శనివారం తెల్లవారుజామున ఇరాన్ పై ఇజ్రాయెల్ క్షిపణులు ప్రయోగించింది.
Car Accident Person Died At White House Gate: అమెరికా అధ్యక్ష భవనం వద్ద మరో ప్రమాదం చోటుచేసుకుంది. వైట్ హౌస్ గేటును కారు ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఏడాదిలో ఇది రెండో ఘటన కావడం గమనార్హం.
Andhra Pradesh Student Murdered: అమెరికాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ కు లోని గుంటూరు జిల్లా బుర్రిపాలెంకు చెందిన పరుచూరి అభిజిత్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తీవ్ర సంచలనంగా మారింది. బోస్టన్ వర్సిటీ క్యాంపస్ లోనే దుండగులు దారుణానికి పాల్పడినట్లు సమాచారం.
Nikola Tesla Airport: టేకాఫ్ అవుతున్న సమయంలో పలు వస్తువులకు తగిలి విమానం దెబ్బతింది. అలాగే ఎగరడంతో పెద్ద రంధ్రం ఏర్పడింది.. దీంతో విమానంలోని ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బెంబేలెత్తిపోయారు.
Munich Security Conference: రష్యా నుండి నిరంతర చమురు కొనుగోలు అంశంపై భారత విదేశీ వ్యవహరాల మంత్రి జైశంకర్ తన దైన స్టైల్ లో రిప్లై ఇచ్చారు. భారతదేశానికి స్వప్రయోజనాలు కలిగే విధంగా. . బహుళ ఎంపికలు ఉండటం మంచి పరిణామమే కదా అని ఆయన అన్నారు. దీన్ని మీరుర పొగడాలే తప్ప విమర్శించకూడాదని రిప్లై ఇచ్చారు.
BAPS Temple UAE: ఎడారి దేశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో అత్యధికంగా ముస్లింలే ఉంటారు. అలాంటి దేశంలో తొలిసారి హిందూ దేవాలయం నిర్మాణమైంది. ఆ మందిరాన్ని భారత ప్రధానమంత్రి ప్రారంభించడం మరింత విశేషం. ఆలయ విశేషాలు.. ప్రత్యేకతలు చూద్దాం.
Kim Watson Unborn Child: తల్లిదండ్రులు కావాలని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ ఒకసారి వచ్చినట్టు వచ్చి మళ్లీ రాకుండాపోతే ఆ బాధ వర్ణనాతీతం. ఇలాంటి పరిణామం తనకు ఎదురవడంతో స్టార్ క్రికెట్ కన్నీటి సంద్రంలో మునిగాడు.
Big Jackpot: పిల్లలే తమ భవిష్యత్ వారి తల్లిదండ్రులు భావిస్తారు. కష్టపడేదంతా వారికోసం. అలాంటి పిల్లల పేరు మీద ఓ తండ్రి లాటరీ టికెట్ కొనగా జాక్‌పాట్ తగిలింది. పిల్లల పేరుతో అతడికి అదృష్టం వరించింది
Pakistan: ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. దేశం రహస్యాలను లీక్ చేసినందుకు 10 సంవత్సరాలు, అతని భార్యతో పాటు ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన విషయం తెలిసిందే.
Israel Hamas war Latest Updates: హమాస్ ఉగ్రవాదులను సమూలంగా నాశనం చేసేవరకు ఇజ్రాయెల్ పట్టువీడడం లేదు. గాజా నగరంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం.. ప్రజలకు ఇబ్బంది తలపెట్టకుండా ఉగ్రవాదులను ఏరివేసేందుకు ప్రయత్నిస్తోంది.
ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో అర్థరాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రత భూకంపం సంభవించడంతో భవనాలు నేల మట్టం అయ్యాయి. శిథిలాల కింద చాలా మంది చిక్కుకోగా.. ఇప్పటి వరికి 300 మందిపైగా మరణించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.