Gold Rate Today: పసిడి ప్రియులకు సంతోషానిచ్చే వార్త. వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నేడు ఒక్కసారి పడిపోయాయి. తులం బంగారం రేటు ఏకంగా రూ. 1000 మేర తగ్గింది. గతవారం నుంచి స్థిరంగా ఉన్న వెండి ధర కూడా నేడు రూ. 500 మేర పడిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో నవంబర్ 26వ తేదీన బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold Rate Today: పసిడి ప్రియులకు తీపికబురు. బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తే ఇదే మంచి సమయం. ఎందుకంటే బంగారం, వెండి ధరలకు రెక్కలు విరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లు బంగారం ధరలు భారీగా పతనమవుతున్న నేపథ్యంలో దేశీయంగా కూడా ఈ ప్రభావం ధరలపై కనిపిస్తోంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా దిగివచ్చింది. గత వారం రోజుల నుంచి భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కొనుగోలు దారులకు భారీ ఊరట లభించినట్లయ్యింది.
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న వేళ బంగారం ధరలు పెరగడంతో ఆందోళన చెందిన వారికి ఈ వార్త ఉపశమనాన్ని కల్గించింది. ధరలు దిగిరావడంతో కొనుగోళ్లు మళ్లీ ఊపందుకుంటున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మరి నేడు అంటే నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో తులం బంగారం ధర, కిలో వెండి ధర ఎంతకు దిగివచ్చిందో మనం తెలుసుకుందాం.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. క్రితం రోజుతో పోల్చితే స్పాట్ బంగారం రేటు ఔన్సుకు ఏకంగా 100 డాలర్ల మేర దిగివచ్చింది. నేటి స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 2621 డాలర్ల దగ్గర ట్రేడింగ్ అవుతోంది. ఇక వెండి ధర ఔన్సుకు 30.10 డాలర్ల వద్దకు దిగివచ్చింది. మరోవైపు ఇండియన్ కరెన్సీ రూపాయి విలువ కాస్త కోలుకుంటోంది. డాలర్ తో పోల్చితే రూ. 84.298 దగ్గర అమ్ముడవుతోంది.
ఇక హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. వారం రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర నేడు ఒక్కరోజే ఏకంగా రూ. 1000 మేర పడింది. నేడ 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1000 తగ్గడంతో రూ. 72వేల మార్క్ వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర తులంపై రూ. 1090 పడిపోయింది. దీంతో తులం ధర రూ. 78వేల 550 వద్దకు దిగివచ్చింది.
అటు వెండి ధరలు కూడా కూప్పకూలాయి. మార్కెట్లో కిలో వెండి ధర క్రితం ధరతో పోలిస్తే నేడు రూ. 500 మేర పడిపోయింది. దీంతో కిలో వెండి ధర హైదరాబాద్ లో రూ. 1,00,500 దగ్గరకు దిగివచ్చింది. అయితే పైన పేర్కొన్న బంగారం, వెండి ధరల్లో ఏ పన్నులు కలపలేదు.