Neck Pain With Stress: విపరీతమైన స్ట్రెస్ కారణంగా మెడ నొప్పి శరీరంలో ఇతర భాగాలను నొప్పులు కనిపిస్తాయి. ఇది టెన్షన్ ఎక్కువ అవ్వటం వల్ల స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఇలా జరుగుతుంది. లేకపోతే కొంత మందికి వర్క్ ఎక్కువ అవ్వడం, కదలకుండా ఎక్కువ సమయంపాటు ఒకే ప్రాంతంలో కూర్చోవడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. వ్యాయామం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా మెడ, భుజాల నొప్పులు వేధిస్తాయి. ఈ మెడ నొప్పి సమస్యను కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. వర్క్ చేసే సమయంలో సరైన బాడీ పొస్చర్ లేకపోవడం వల్ల కూడా మెడ నొప్పి సమస్య వస్తుంది.
విపరీతమైన స్ట్రెస్ కారణంగా మెడ, భుజాల్లో బాగా నొప్పి అనుభవిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం కొన్ని టిప్స్‌తో వీటిని అధిరోహించవచ్చు. ఈ మెడ నొప్పి వల్ల సరైన నిద్ర కూడా పట్టదు. దీనివల్ల స్ట్రెస్ మరింతగా పెరుగుతుంది. వర్క్ చేసే సమయంలో ఎక్కువ సమయంపాటు అలాగే కూర్చోకుండా అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోండి. మెడ చేతులు స్ట్రెచ్ చేస్తూ ఉండాలి.
ఈ స్ట్రెచింగ్ డైలీ రొటీన్ లో భాగం కావాలి. దీంతో మెడ నొప్పి భుజాల నొప్పులు తగ్గిపోతాయి.
మెడనొప్పి భుజాలు నొప్పితో బాధపడుతున్న వారు బరువు అధికంగా మోయకుండా ఉండాలి. జిమ్ వెళ్ళినప్పుడు అతిగా బరువు లేపడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది.
సరైన దిండు ఉపయోగించకపోవడం వల్ల కూడా మెడనొప్పి వస్తుంది. దిండు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రెజర్ పాయింట్ పై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో నిద్ర సమస్యలు కూడా వస్తాయి. మెడనొప్పి పెరుగుతుంది. తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నప్పుడు ఫిజియోతెరపి తీసుకోవాలి. చిన్న చిన్న ఎక్సర్సైజులు చేయడం వల్ల కూడా త్వరగా మెడనొప్పి తగ్గిపోతుంది. ఫిజియోథెరపీ, హిట్ థెరపీ మసాజ్ వల్ల మెడనొప్పి భుజాల సమస్య తగ్గిపోతుంది.
ఇదీ చదవండి: రైలు టిక్కెట్‌పై పేరు, ప్రయాణం చేసే తేదీ మార్చుకోవచ్చని మీకు తెలుసా?
వేడి నీటితో మాత్రమే కాదు కొల్డ్ థెరపీ ద్వారా కూడా మెడ నొప్పి సమస్య తగ్గిపోతుంది. వార్మ్ కంప్రెసర్ హాట్ వాటర్ బాటిల్ భుజాల నొప్పి ఉన్న ప్రాంతంలో 20 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఐస్ ప్యాక్ ఉపయోగించి కూడా మెడ భుజాల నొప్పి ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల వాపు సమస్య తగ్గుతుంది. ముఖ్యంగా మెడ నొప్పి సమస్య నుంచి బయటపడడానికి స్ట్రెస్ తగ్గించుకోవాలి.
దీనికి కొన్ని మెడిటేషన్, శ్వాస సంబంధిత ఎక్సర్సైజులు వంటివి చేయాలి. కండరాలు ఉపశమనం కలిగించే యాక్టివిటీలో చురుగ్గా పాల్గొనాలి. ఇలా చేయడం వల్ల స్ట్రెస్ త్వరగా తగ్గిపోతుంది. ఈ మెడనొప్పి భుజాల సమస్య మరింత తీవ్రతరం అయితే వెంటనే వైద్యులను సంప్రదించండి. వైద్యుల సూచనలు పాటించండి.
ఇదీ చదవండి: ఈ 7 ఆహారాల్లో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది.. మీ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.