Iron: ఈ 7 ఆహారాల్లో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది.. మీ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి..

Iron Rich Foods: మనం తీసుకున్న ఆహారాల్లో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండాలి. అందులో ఐరన్ ఎంతో ముఖ్యం. ఐరన్ ఉండటం వల్ల అనీమియా సమస్య రాదు. ముఖ్యంగా మహిళలకు ఐరన్ ఎంతో మేలు చేస్తుంది. అయితే పాలకూరలో ఐరన్ ఉంటుంది. కానీ పాలకూర కంటే కూడా ఎక్కువ ఐరన్ ఉండే ఆహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం...

Written by - Renuka Godugu | Last Updated : Nov 29, 2024, 02:39 PM IST
Iron: ఈ 7 ఆహారాల్లో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది.. మీ శరీరానికి తక్షణ శక్తినిస్తాయి..

Iron Rich Foods: ఐరన్ తీసుకోవడం వల్ల మన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ప్రతిరోజు మనం తీసుకున్న ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఐరన్ పుష్కలంగా ఉండే ఏడు ఆహారాలు ఉన్నాయి. ఇందులో పాలకూర కంటే పుష్కలంగా ఐరన్ ఉంటుంది...

Add Zee News as a Preferred Source

సార్డైన్ చాప..
సార్డైన్ చేపలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. సార్డైన్ చేప డైట్ లో చేర్చుకోవడం వల్ల పాలకూర కంటే ఎక్కువ ఐరన్ అందుతుంది... ఈ చేపలో ఫ్యాటీ ఆసిడ్స్ తో పాటు కాల్షియం, విటమిన్ డి కూడా పుష్కలంగా ఉంటుంది... ఈ చలికాలం సీజన్లో విటమిన్ తక్కువ అవుతుంది. కాబట్టి ఈ చేపలను డైట్ లో చేర్చుకోవాలి సార్డైన్ చేపలో ఎఫెక్టివ్ గా ఐరన్ ఉంటుంది..

ఆయిస్టర్స్..
ఆయిస్టార్స్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది.. ఈ సముద్రపు ఫుడ్ లో ఐరన్ 6 గ్రాములు ఉంటుంది. ఐరన్ తక్కువ అయినప్పుడు ఈ ఆయిస్టార్స్ ని డైట్ లో చేర్చుకోండి..

కాబూలీ చనా..
కాబూలీ చనాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.. వీటిని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం రక్తపోటు అదుపులో ఉంటుంది.. కాబూలీ చనాలో ప్రోటీన్స్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది.. అంతే కాదు ఇందులో డైటరీ ఫైబర్ ఉండటం వల్ల కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలుగుతుంది... కాబూలీ చనా గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది దీని కూర రూపంలో సలాడ్ రూపంలో తీసుకోవచ్చు.

గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజల్లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో పాలకూర కంటే పుష్కలమైన ఐరన్ ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది... ఇందులో మెగ్నీషియం, జింక్ కూడా ఉంటుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండటం వల్ల వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి ఇది మేలు చేస్తుంది. ఉమ్మడి గింజలను స్నాక్ రూపంలో తీసుకోవచ్చు.

ఇదీ చదవండి:  Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..

సోయాబీన్స్..
సోయాబీన్స్ లో కూడా ఐరన్ పుష్కలం. అంతేకాదు ఇందులో ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. శరీర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వారికి ఇది ఎంత ఆరోగ్యకరం ఇందులో ఉండే ఫైబర్ షుగర్ వ్యాధిగ్రస్తులకు కూడా మంచిది కడుపు నిండిన అనుభూతి ఎక్కువ సమయం పాటు కలిగిస్తుంది.

కిడ్నీ బీన్స్..
కిడ్నీ బీన్స్ కూడా ఉడికించి తీసుకోవాలి. ఇది కూరల రూపంలో కూడా తీసుకుంటారు మంచి సలాడ్‌ కూడా తీసుకోవచ్చు కిడ్నీ బీన్స్ ని రాత్రి నానబెట్టి ఉదయం కూరలా వండుతారు.. బీన్స్ లో ప్రోటీన్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి... దీంతో పాటు పాలకూర కంటే అధిక మోతాదులో ఇందులో ఐరన్ ఉంటుంది.

ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!

డ్రై ఆప్రికాట్..
డ్రై ఆప్రికాట్ లో కూడా ఐరన్ పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, విటమిన్ ఏ కూడా ఉంటుంది... ఇందులో ఉండే విటమిన్ ఏ కంటి చూపుకు ఆరోగ్యానికి మేలు చేస్తుంది... పొటాషియం కడుపు సమస్యలకు చెక్ పెడుతుంది. ఇది కాకుండా ఇందులో పాలకూర కంటే అధిక మోతాదులో ఐరన్ ఉంటుంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

...Read More

Trending News