Tirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారం

Other Religion Quotes Scorpio Found In Tirumala: కొత్త పాలక మండలి బాధ్యతలు చేపట్టినా కూడా తిరుమలలో పరిస్థితి మారడం లేదు. తాజాగా మరోసారి అన్యమతానికి చెందిన ఆనవాళ్లు కనిపించాయి. ఆ మతానికి చెందిన వాహనం నేరుగా తిరుమల ప్రధాన ఆలయం వరకు చేరుకోవడం తీవ్ర దుమారం రేపుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 30, 2024, 03:54 PM IST
Tirumala: తిరుమలలో మళ్లీ అన్యమత ఆనవాళ్లు.. విజిలెన్స్ వైఫల్యంతో తీవ్ర దుమారం

Other Religion Quotes: పవిత్రమైన తిరుమలలో నిఘా వైఫల్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. ఫొటోషూట్‌లు.. ప్రాంక్‌ వీడియోలతోపాటు నిషేధిత పదార్థాలు కనిపిస్తుండగా.. ఇతర మతాలకు చెందిన వస్తువులు, ఆనవాళ్లు.. ఆ మతాల సందేశాలు కూడా ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా అన్యమత బోధనలతో కూడిన వాహనం ఏకంగా తిరుమల ప్రధాన ఆలయానికి చేరువగా చేరుకుంది. వాహనంపై ఉన్న బోధనలను చూసి భక్తులు విస్తుపోయారు. ఆ వాహనానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

Also Read: Tirumala: రాజకీయ నాయకులకు బిగ్‌షాక్‌.. తిరుమలలో వాటిపై నిషేధం

ఓ మతానికి సంబంధించిన కొన్ని వాక్యాలతో స్కార్పియో వాహనం శనివారం తిరుమలలోని వరహస్వామి ఆలయం వద్ద ఉన్న అర్చక భవనం వద్ద ప్రత్యక్షమైంది. మూడంచెల భద్రతా ఉన్న తిరుమల కొండపై అన్యమతస్తులకు చెందిన ఒక వాహనం వరాహ స్వామి ఆలయం వరకు రావడం వివాదాస్పదమైంది. స్కార్పియో వెనుక అద్దం మీద ఓ మతానికి సంబంధించిన వాక్యాలు ఉన్న వాహనం తిరుమల కొండపైకి ఎలా వచ్చిందని భక్తులు మండిపడుతున్నారు.

Also Read: Cyclone Fengal: ఆంధ్రప్రదేశ్‌కు వరద ముప్పు.. ఫెంగల్‌ తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

ఇటీవల కొత్తగా నియమితమైన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి అన్యమతంపై కఠిన చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే అమలులో మాత్రం విఫలమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్యమత ప్రచారం తిరుమలలో ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పిన బోర్డు అంతలోనే ఓ మతానికి చెందిన వాహనం మాఢవీధుల్లోకి అతి సమీపంలోకి రావడం విస్తుగొలుపుతోంది. వరాహస్వామి ఆలయం ఎదురుగా అర్చక నిలయం దగ్గర వరకు రావడం కలకలం రేపుతోంది. కాగా ఈ వాహనం రాకపై తిరుమల తిరుపతి విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ వాహనం ఎవరిది? ఎందుకు వచ్చిందనేది ఆరా తీస్తున్నట్లు సమాచారం.

తిరుమలలో భారీ వర్షం
నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం.. ఫెంగల్‌ తుఫాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా ఎడతెరపలేని వర్షం కురుసతోంది. వర్షంతో పాటు చలిగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. రాత్రి సమయంలో మంచు కురుస్తూ పగటి పూట ఆగకుండా వర్షం పడటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. వర్షం కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 18 గంటలు సమయం పడుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News