Allu Arjun vs Varun Tej: అల్లు అర్జున్ పుష్ప సినిమా డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కోసం ప్రపంచవ్యాప్తంగా.. సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ దగ్గర నుంచి కొంచెం నెగిటివిటీ కూడా రావడం.. గమనర్హం. తాజాగా ఇప్పుడు మరో వార్త తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ అదేమిటో ఒకసారి చూద్దాం..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా ఏకంగా.. అల్లు అర్జున్‌కి నేషనల్ అవార్డు సైతం తెచ్చిపెట్టింది. అంతేకాదు ప్రస్తుతం ఇండియాలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా.. పుష్ప 2కి గాను.. నిలిచారు.
అల్లు అర్జున్ ఇంతటి ప్రత్యేకత సంపాదిస్తున్నా కానీ.. సొంత తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కొంతమంది దగ్గర నుంచి ఎక్కువగా నెగెటివిటీ వస్తోంది. అసలు విషయానికి వస్తే ప్రస్తుతం మెగా అభిమానులు అల్లు అభిమానులు సోషల్ మీడియాలో.. విపరీతంగా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే.
మెగా ఫ్యామిలీ గొప్ప అని మెగా అభిమానులు కామెంట్లు పెడుతుండగా.. అల్లు అర్జున్ గొప్ప అని అల్లు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో పుష్పా సినిమాని మెగా అభిమానులు చూడకూడదు అని.. బాన్ వేస్తామని.. కామెంట్స్ వస్తున్నాయి.
కాగా ఇదే విషయానికి గాను ఇప్పుడు వరుణ్ తేజ్‌ని మెగా అభిమానులు అల్లు అర్జున్‌కి పోటీగా దింపుతున్నారు. అసలు విషయానికి వస్తే.. డిసెంబర్ 5న ఓటీటీలో వరుణ్ తేజ్ హీరోగా చేసిన మట్కా సినిమా విడుదలవుతోంది. ఇక అదే రోజు థియేటర్స్ లో పుష్ప సినిమా వస్తోంది.
ఈ నేపథ్యంలో మెగా అభిమానులు.. వరుణ్ తేజ్ సినిమా ఓటీటీలో చూసి వ్యూస్ తెప్పిద్దామని.. పుష్ప సినిమాకి మాత్రం మొదటి రోజు వెళ్ళద్దని కామెంట్స్ పెడుతున్నారు. మరోపక్క అల్లు అభిమానులు మాత్రం.. ఆ సినిమాని థియేటర్లో డిజాస్టర్ చేశారు.. ఇప్పుడేమో మా హీరోకి భయపడి అదే చిత్రం.. ఓటీటీలో చూస్తాం అంటున్నారు అని కౌంటర్ వేస్తున్నారు. మొత్తానికి అల్లుమేగా అభిమానుల మధ్య ఈ వార్ ఎప్పటికీ ఎండ్ అవుతుందో.. తెలియాలి అంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.