Gold Rate Today: హమ్మయ్య..మొత్తానికి బంగారం ధరలు శాంతించాయి. డిసెంబర్ ఒకటో తేదీ ఆదివారం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79,100 పలుకుతుండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,400 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం గరిష్ట స్థాయితో పోల్చితే స్వల్పంగా తగ్గింది.
Gold Rate Today: బంగారం ధరలు కొన్నాళ్లుగా భారీగా పెరుగుతూ..తగ్గుతూ ఉన్నాయి. అయితే శనివారం, ఆదివారం మాత్రం స్వల్పంగా తగ్గాయి. బంగారం ధర 80వేల కంటే తక్కువగానే ఉంది. ఒక దశలో బంగారం ధర 84వేల వరకు చేరుకుంది. అక్కడి నుంచి నెమ్మదిగా తగ్గుతూ రావడం ప్రారంభించింది
బంగారం ధరలు తగ్గడానికి ప్రధాన కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులే అని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. ప్రస్తుతం బంగారం ధరలు తగ్గడానికి అమెరికాలోని డాలర్ బలం పుంజుకోవడం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
పసిడి ధరలు తగ్గడానికి అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ముఖ్యంగా ట్రంప్ అమెరికాలో ప్రొటెక్షనిజం చర్యలు చేపడతారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అక్కడి స్టాక్ మార్కెట్లో పాజిటివ్ కనిపిస్తోంది. ఫలితంగా బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు కూడా ఇన్వెస్ట్ మెంట్ ను బంగారం వైపు నుంచి తొలగించి స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తున్నారు.
బంగారం ధరలు రానున్న కాలంలో భారీగా తగ్గే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్రంప్ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫిబ్రవరి నెలలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయన్న వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తల నేపథ్యంలో బంగారం ఇప్పుడు కొనుగోలు చేయవచ్చా లేదంటే కొన్నాళ్లు ఆగాల్సి ఉంటుందా అనే సందేహం బంగారం ప్రియుల్లో నెలకొంది. అయితే బంగార ధర తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడంతో ధర ఆటోమెటిగ్గా పెరుగుతుంది.
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు సాధారణమే అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ధరలు తగ్గకపోవచ్చని నిపుణులు అంటున్నారు.