Chiranjeevi: ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి డూప్ గా నటించింది వీళ్లా.. ఫ్యూజలు ఎగిరిపోవడం పక్కా..

Chiranjeevi Dupe:మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో ఎన్నో విభిన్న పాత్రల్లో మెప్పించారు. అందులో ఎన్నో  చిత్రాల్లో డ్యూయల్ రోల్లో యాక్ట్ చేసిన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే కదా. అయితే..చిరు.త్రిపుల్ రోల్లో  యాక్ట్ చేసిన ఏకైక చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. ఈ చిత్రంలో చిరు.. మూడు పాత్రల్లో కనిపించే సీన్స్ లో ఎవరు డూప్ గా నటించారో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి.

1 /10

Chiranjeevi Mugguru Monagallu Triple Role Dupe : చిరంజీవి తన ఫిల్మ్  కెరీర్ లో ఎన్నో సినిమాల్లో డ్యూయల్ రోల్లో మెప్పించారు. కానీ ముగ్గురు మొనగాళ్లు మూవీలో  మాత్రం అంటే మూడు పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా పృథ్వీ, విక్రమ్, నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ పాత్రల్లో జీవించారు మెగాస్టార్.

2 /10

కే.రాఘవేంద్ర రావు, చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన పన్నెండో చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు. ఈ సినిమాను చిరంజీవి తన సొంత బ్యానర్ అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్ లో నాగబాబు, పవన్ కళ్యాణ్ నిర్మాతలుగా ఈ సినిమా తెరకెక్కింది.

3 /10

ముగ్గురు మొనగాళ్లు సినిమాలో చిరంజీవి సరసన రోజా,నగ్మా, రమ్యకృష్ణ నటించారు. ఈ చిత్రానికి విద్యాసాగర్ అద్భుతమైన సంగీతం అందించారు. పైగా అప్పటికే చిరు, దర్శకేంద్రుడు కాంబినేషన్ లో ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’,  రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు వంటి హాట్రిక్ హిట్స్ అందుకున్నారు. దీంతో వీళ్ల కాంబినేషన్ లో చిరు ఓన్ బ్యానర్ లో తెరకెక్కిన ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

4 /10

ముందుగా ‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను రౌడీ అల్లుడు తరహాలో రెండు పాత్రల్లో తీద్దామనుకున్నారు. కానీ  రాఘవేంద్రరావు రెగ్యులర్ గా కాకుండా మరో పాత్రతో తెరకెక్కిద్దామని మరో క్యారెక్టర్ యాడ్ చేసారు. కథను మెగా కంపౌండ్ ఆస్థాన రచయత సత్యానంద్ పూర్తి కథను రెడీ చేశారు.

5 /10

ముగ్గురు మొనగాళ్లు సినిమాలో పృథ్వీ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటించారు. విక్రమ్ అనే పోలీస్ అధికారి పాత్ర కూడా చిరు చేసిన రెగ్యులర్ పాత్రలే కావడం గమనార్హం. కానీ నటరాజ రామకృష్ణ దత్తాత్రేయ పాత్రనే చిరుకు కొత్తగా కనిపించింది. అంతకు ముందు బాలచందర్ ‘రుద్రవీణ’లో బ్రాహ్మణ యువకుడి పాత్ర చేసిన అది పూర్తిగా సీరియస్ గా సాగే పాత్ర. ఇందులో కాస్త కామెడీ టచ్ తో చిరు ఈ పాత్ర కోసం స్పెషల్ కేర్ తీసుకొని నటించి మెప్పించారు.

6 /10

ఈ సినిమా టైటిల్ విషయంలో పెద్ద రచ్చే నడిచింది. ఈ చిత్రానికి కే.రాఘవేంద్రరావు ‘ముగ్గురే ముగ్గురు’ లేదా ముగ్గురు మొనగాళ్లు టైటిల్స్ సూచించారు. ఇవి నాగబాబు కు నచ్చలేదు. ఆయన ఈ సినిమాకు ‘అద్భుత సహోదరులు’, ఘరానా మొనగాళ్లు, అనే టైటిల్స్ పెడడామన్నారు. చివరకు అందరు ఈ టైటిల్స్ పై ఓటింగ్ చేస్తే ‘ముగ్గురు మొనగాళ్లు’ టైటిల్ ను ఫైనల్ చేశారు.

7 /10

గతంలో ఇదే ‘ముగ్గురు మొనగాళ్లు’ టైటిల్ తో శోభన్ బాబు హీరోగా.. రజినీకాంత్ హీరోగా ఓ డబ్బింగ్ చిత్రం రావడం విశేషం. ముగ్గరు మొనగాళ్లు టైటిల్ తో తెలుగులో వచ్చిన మూడో చిత్రం ఇదే కావడం గమనార్హం. ఆ తర్వాత మరో సినిమా కూడా వచ్చింది. ఈ సినిమా కోసం చిరు బాగానే కష్టపడ్డారు. ఉదయం అమ్మ శ్రీవిద్యతో సెంటిమెంట్ సీన్స్.. మధ్యాహ్నంతో రోజాతో రొమాంటిక్ సీన్.. రాత్రి.. శరత్ సక్సేనాతో ఫైట్స్ సీన్స్ చేశారు.  

8 /10

‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమాను 100 రోజుల వర్కింగ్ డేస్ లో కంప్లీట్ చేశారు. అందులో క్లైమాక్స్ కోసమే 30 రోజులు పట్టింది. అందులో 28 రోజులు చిరు షూట్ లో పాల్గొన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ కోసం ఐదు కెమెరాలో ఉపయోగించారు.

9 /10

‘ముగ్గురు మొనగాళ్లు’ సినిమా ముందు వరకు  చిరంజీవి  డూప్ గా కమెడియన్ సుధాకర్ కానీ.. నటుడు ప్రసాద్ బాబు కానీ యాక్ట్ చేసేవారు. చిరు యాక్ట్ చేసిన ఈ సినిమా ముగ్గురు చిరంజీవి కలిసే సీన్స్ లలో చిరంజీవి ఒక డూప్ గా ప్రసాద్ బాబు యాక్ట్ చేశారు. మరో క్యారెక్టర్ కోసం చిరంజీవి పర్సనల్ పీఏ సుబ్బరాజును తీసుకున్నారు. ఆయన నటుడు కమ్ నిర్మాత. చిరుకు అత్యంత సన్నిహితుడు.  

10 /10

సుబ్బరాజు ది చిరంజీవి పర్సనాలిటీ కావడం.. పైగా మెగాస్టార్ కన్విన్స్ చేయడంతో ఈ సినిమాలో డూప్ గా యాక్ట్ చేయడానికి ఓకే చెప్పారు. ఈ సినిమా 1994 సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది.  కానీ రిపీట్ రన్ లో ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. ఏమైనా చిరు త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం అభిమానులకు తీపి గుర్తు అని చెప్పాలి.