Kerala Rains: 2024లో ఇప్పటికే కేరళను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. తాజాగా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలను ఫెయింజల్ తుఫాను ఒణికిస్తోంది. తుఫాను ప్రభావంతో తెలంగాణలో కూడా వాతావరణం పూర్తిగా మారిపోయింది. ఈ తుఫాను ఎఫెక్ట్ కేరళపై పడింది. ఇపుడు వరదలతో అతలాకుతలమై తేరుకుంటున్న కేరళకు ఈ వర్షాలతో బెంబేలెత్తుతున్నారు. ముఖ్యంగా ఫెయింజల్ తుఫాను ప్రభావంతో కేరళలోని పతనంతిట్ట జిల్లాలో గ్యాప్ లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి కొలువైన పత్తనంతిట్టలో వర్షాలతో అయ్యప్ప స్వాములు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కాలినడక వెళ్లే అయ్యప్ప భక్తులు బురదలో వెళ్లాల్సి వస్తోంది. ఎక్కడ జారీ పడతారనే ఆందోళన భక్తుల్లో నెలకొంది. ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
ముఖ్యంగా ఈ సీజన్ లో శబరిమలకు అయ్యప్ప స్వాముల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం అక్కడ భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ముఖ్యంగా నిన్న ఉదయం నుంచి శబరిమలలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తూనే ఉంది.
పంబ, సన్నిధానంలో ఉదయం నుండి కురుస్తున్న వర్షంతో పంపానదిలో పెరుగుతున్న నీటి ప్రవాహం. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో అయ్యప్ప భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అయ్యప్పలు కూడా జోరు వర్షాన్ని లెక్క చేయకుండా అలాగే వర్షంలోనే అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకుంటున్నారు.
ఎడతెరిపి లేని వర్షంలో కూడా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి పోటెత్తిన అయ్యప్ప భక్తులు.భారీ వర్షాల నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం విపత్తు నిర్వహణ సహాయక బృందాలను రంగంలోకి దింపింది. ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక, రాపిడ్ యాక్షన్ టీం, పోలీస్ సిబ్బందిని అలర్ట్ చేసింది. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భక్తులను ప్రమాదకరమైన ప్రదేశాలకు వెళ్లకుండా చూడాలని పతనంతిట్ట కలెక్టర్ ఆదేశాలు జారీచేశారు.ముఖ్యంగా శబరిమలలో కొండల్లో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో, నదులు, అడవులు ఉన్న ప్రాంతాల్లో భక్తులను అనుమతించరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇదీ చదవండి: Mega Family: మెగా కుటుంబంలో ఆ ఫీట్ రిపీట్ అవుతుందా.. అపుడు చిరంజీవి.. ఇపుడు నాగబాబు..
ఇదీ చదవండి: Pushpa 2 the Rule First Review: ‘పుష్ప 2 ది రూల్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. అల్లు అర్జున్ కుమ్మినట్టేనా..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.