Tirumala News: తిరుమలకు వెళ్తున్నారా..?.. తిరుగు ప్రయాణంలో ఈ పని మర్చిపోకుండా చేయాలంట.. మీకు ఈ విషయం తెలుసా..?

Tirupati: తిరుమలకు ప్రతి రోజు కోట్లాది మంది భక్తులు వస్తుంటారు.  దేశ,విదేశాల నుంచి స్వామి వారికి దర్శనం కోసం వస్తుంటారు. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా అదే విధంగా చర్యలు సైతం చేపట్టింది.
 

1 /6

తిరుమల శ్రీవారిని కలియుగంలో కొంగు బంగారంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా చెప్తుంటారు.  కొంత మంది కాలీనడకన వస్తుంటే.. మరికొందరు దివ్యదర్శనం, స్పెషల్ దర్శనం టోకెన్లతో స్వామి వారి ఆలయంకు వస్తుంటారు.

2 /6

శ్రీవారి దర్శనం కోసం ఎంతసేపైన క్యూలైన్ లలో నిల్చొని ఉంటారు. అంతే కాకుండా.. స్వామి వారిని కన్నులారా చూసేందుకు తెగ తాపత్రయ పడుతుంటారు. ఇదిలా ఉండగా. . ప్రస్తుతం తిరుమలలో టీటీడీ అనేక విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చినట్లు తెలుస్తొంది.  

3 /6

ఇటీవల టీటీడీకి నూతన పాలక వర్గంను సైతం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బీఆర్ నాయుడు ప్రస్తుతం టీటీడీకి చైర్మన్ గా ఎంపికయ్యారు. అదే విధంగా.. సీఎం చంద్రబాబు సైతం.. వీఐపీ సేవల్లో తరించకూడదని అన్నారు.

4 /6

సామాన్యుడే ఫస్ట్ ప్రయారిటీగా స్వామి వారి దర్శనం అయ్యేలా చూడాలన్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం తిరుమలలో టీటీడీ కూడ అనేక మార్పుల్ని తీసుకొచ్చిందని చెప్పుకొవచ్చు. అయితే.. తిరుమలల ప్లాస్టిక్ వాడకం పూర్తిగా నిషిధ్దమని తెలిసిందే.   

5 /6

అదే విధంగా తిరుమలకు వెళ్లేటప్పుడు.. టీటీడీ రూ. 50 లకు... గాజు గ్లాస్ ను భక్తులకు అందిస్తుంది. దాన్ని తీసుకుని భక్తుల కొండ మీదకు వెళ్తుంటారు. అయితే.. చాలా మంది తిరుగు ప్రయాణంలో ఆ గాజు గ్లాసును తమతో పాటు ఇంటికి తీసుకెళ్తుంటారు.  

6 /6

కానీ అలాకాకుండా.. తిరుగు ప్రయాణంలో ఏ షాపులో అయిన ఆ గాజు గ్లాసును ఇస్తే.. తిరిగి రూ. 30 రిటర్న్ ఇచ్చేస్తారంట. అంటే.. కేవలం రూ. 20 లకు మాత్రమే టీటీడీ ప్యూర్ , శుభ్రమైన నీటిని భక్తులకు అందిస్తుందన్న మాట. ఈ విషయం చాలా మంది భక్తులు తమకు తెలిదని అంటుంటారు.