Vitamin B12 Veg Foods: ఆధునిక జీవన విధానంలో బిజీ లైఫ్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. అన్నింటికీ కారణం చెడు ఆహారపు అలవాడ్లు, చెడు జీవనశైలి. హెల్తీ ఫుడ్స్ లేకపోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ల కొరత ఏర్పడుతోంది. ఇందులో ముఖ్యమైంది విటమిన్ బి12, రెడ్ బ్లడ్ సెల్స్ నిర్మాణం, నాడీ వ్యవస్థ పనితీరులో ఇది చాలా కీలకం. అందుకే విటమిన్ బి12 లోపముంటే బలహీనత, అలసట, డిప్రెషన్, తలనొప్పి వంటి సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అయితే ఈ 5 హెల్తీ ఫుడ్స్ తింటే ఎలాంటి సమస్య ఉత్పన్నం కాదు.
సోయా మిల్క్ పాలు తాగే అలవాటు లేకపోతే సోయా మిల్క్ బెస్ట్ ఆప్షన్ కాగలదు. ఇందులో విటమిన్ బి12తో పాటు ప్రోటీన్లు కూడా పుష్కలంగా ఉంటాయి.
న్యూట్రిషనల్ ఈస్ట్ న్యూట్రిషనల్ ఈస్ట్ అనేది ఒక సూపర్ ఫుడ్. విటమిన్ బి12 కు బెస్ట్ సోర్స్ ఇది. సలాడ్, సూప్ లేదా డిష్పై గార్నిష్ చేసి తీసుకోవచ్చు. రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది
ఫోర్టిఫైడ్ ధాన్యం మార్కెట్లో చాలా రకాల ఫోర్టిఫైడ్ ధాన్యం లభిస్తోంది. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. శాకాహారం తీసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్
పన్నీరు పన్నీరులో ప్రోటీన్లతో పాటు విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటుంది. రోజూ తీసుకోవడం లేదా వారంలో 3-4 సార్లు తినడం వల్ల విటమిన్ బి12 కొరత రాదు.
పెరుగు పెరుగులో విటమిన్ బి12 సమృద్ధిగా ఉంటుంది. రోజూ డైట్లో పెరుగు ఉంటే విటమిన్ బి12 కొరత అస్సలు ఎదురుకాదు.