Bigg Boss 8 Polling Update: బిగ్ బాస్ 8 తెలుగు సీజన్‌పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సీజన్‌కు సంబంధించిన ఓటింగ్ నిన్న శుక్రవారం రాత్రి 11 గంటలకు ముగిసింది. అయితే, ప్రేక్షకుల తీర్పు మేరకు అయితే, తెలుగు వాడే విన్నర్ అయ్యారు. అయితే, ఓటింగ్ ఒక్కటే ప్రామాణికం కాదు కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరు? తెలుసుకుందాం.
బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే రేపు డిసెంబర్ 15 ఆదివారం నిర్వహించనున్నారు. అయితే, ఇప్పటికీ ఫైనల్స్‌లో ఐదు మంది కంటెస్టెంట్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. అందులో నిఖిల్, అవినాశ్, గౌతమ్, నబీల్, ప్రేరణలు ఉన్నారు.
అయితే, ఇందులో ఒకరు బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు విన్నర్స్ కానున్నారు. ఆడియన్స్ ఓటింగ్ కూడా నిన్నటితో ముగిసింది. ప్రతి శుక్రవారం రాత్రి 11 గంటలకు ఓటింగ్ క్లోజ్ అయిపోతుంది. ప్రేక్షకులు తమ నిర్ణయాన్ని ఇచ్చేశారు. ఇక తుది నిర్ణయం బిగ్ బాస్‌దే.
ఈ సీజన్లో ఐదు రెగ్యులర్ కాకుండా ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీతో హౌస్‌లోకి కొంతమందిని పంపించారు. ఇందులో అవినాష్, రోహిణి, టేస్టీ తేజ, గంగవ్వ, గౌతమ్, మెహబూబ్, నయనీ పావనీ, హరితేజలు ఉన్నారు.
ఇందులో చివరి వరకు మొదటి కంటెస్టేంట్ బిగ్ బాస్ ఫినాలే టిక్కెట్‌ను అవినాశ్ దక్కించుకున్నారు. ఇప్పుడు కేవలం ఐదు మంది హౌస్ లో ఉన్నారు ఇందులో పైనల్ ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నిఖిల్, గౌతమ్ మధ్య అసలు పోటీ ఉండనుంది.
అయితే, ప్రేక్షకులు ఎక్కువ శాతం ఓటింగ్ 37 శాతం వరకు తెలుగు వాడైన గౌతమ్‌కు ఇచ్చేశారు. ఆ తర్వాతి స్థానంలో నిఖిల్ 33 శాతం ఓట్ల పడ్డాయి. అయితే ఇది కేవలం ఒపీనియన్ మాత్రమే.. బిగ్ బాస్ ఏ నిర్ణయం తీసుకుని ఎవరిని విన్నర్ చేయాలన్నదే ఆయనే నిర్ణయం తీసుకుంటారు. కానీ, ప్రేక్షకుల ప్రకారం గౌతమ్ అసలైన విన్నర్.రేపు ఫినాలేలో ఎవరు అవుతారో వేచి చూద్దాం..