Nagamani Stones Pics: నాగమణి కేవలం నాగుపాములకు మాత్రమే ఎలా తయారవుతుందో తెలుసా.. నాగమణి ఉన్నవారు పక్కా ధనవంతులవుతారా? అలాగే దీనివల్ల దీర్ఘకాలిక వ్యాధులు కూడా నయమవుతాయా? వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Nagamani Stones Pics: నాగమణికి కాపలాగా నాగిని ఉంటుంది. ఎవరైనా స్వార్థంతో నాగమణిని దొంగలించాలని అనుకుంటే వారిని చంపేస్తుంది. ఇది మనకు సినిమాల్లో కనిపించే దృశ్యాలు.. నాగు పాములో నాగమణి ఎలా ఏర్పడుతుంది? నాగు పాములకు రత్నం ఏర్పడే శక్తి నిజంగానే ఉంటుందా? ఇంతటి శక్తివంతమైన నాగమణి ఎక్కడ దొరుకుతుంది. అసలు నాగినిలు నాగమణిలు ఈ కాలంలో కూడా ఉంటాయా? నాగినిలు, నాగమణికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ..
హిందువులు నాగుపాములను దేవతలుగా భావించి పూజలు చేస్తారు. నాగుల చవితి నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. పుట్టలో పాలు పోసి ప్రదక్షిణలు చేస్తారు. హిందూ పురాణాల ప్రకారం నాగుపాము తలపై ఆభరణంగా ఉండేదాన్ని మనీ అని పిలుస్తారు.
ఈ నాగమణి గురించి వాయు, అగ్ని, విష్ణు, బ్రహ్మ పురాణాల్లో ప్రస్తావించారు. ఇది అత్యంత శక్తివంతమైనదని.. విలువైనదని మంత్ర శక్తులు కలిగిన మనీ అని హిందువుల నమ్మకం.. స్వాతి నక్షత్రం రోజు వర్షం పడినప్పుడు ఆ వర్షబిందువు నాగుపాము నోట్లోకి వెళ్లడం ద్వారా మని రూపొందడం మొదలవుతుందట.
ఇతిహాసాల ప్రకారం.. మణి కేవలం నాగుపాములోని రూపొందుతుంది. ఎందుకంటే నాగుపాము మాత్రమే వందేళ్లు భూమి మీద బ్రతక గలుగుతాయట. ఒకసారి పాములో నాగమణి రూపొందిందంటే.. ఆ పాము అద్భుతమైన శక్తిసామర్థ్యాలు సొంతం చేసుకుంటుంది.
ఆ పాము ఏ రూపంలో అయినా మారగలుగుతుంది.. అలా నాగుపాము మనిషి రూపంలోకి మారితే వాసుకి అని అంటారు. దీని ప్రకారం మణి కలిగిన నాగుపాము మనిషి రూపంలోకి మారగలదు. నాగమణి నాగుపాము యొక్క తలభాగంలో ఉంటుంది. చందమామల మెరిసిపోతూ ఉండే నాగమణికి లేదా నీలిరంగు ఉంటుంది.
ఇది కేవలం చీకట్లో మాత్రమే బాగా మెరుస్తుంది. ఈ నాగమణి మన దగ్గర ఉండటం అదృష్టం అంటారు. ఈ మనీ ఉన్న వ్యక్తి సిరిసంపదలు పొందగలుగుతాడట. ఎప్పుడైతే మనీని పాము నుంచి తొలగిస్తారో అప్పుడు నాగుపాము మరణిస్తుంది.
వజ్రాల కంటే విలువైన నాగమణి మన దగ్గర ఉంటే.. పాము కాటు వేయడానికి కూడా రాదని.. కలిసి వస్తుందని.. అలాగే ధనవంతులు అవుతారని ఒక నమ్మకం ఉంది. అలాగే నాగమణి చాలా విలువైనదే కాకుండా ... మంత్ర శక్తులు కూడా కలిగి ఉంటుందని హిందువుల నమ్మకం. దీర్ఘకాలిక వ్యాధులు నాగమణి ద్వారా నయం అవుతాయని కొన్ని ఔషధ శాస్త్రాలు చెబుతున్నాయి.