Rashmika Mandanna: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ రష్మిక జంట గురించి పరిచయాలు ప్రత్యేకంగా.. అవసరం లేదు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ జోడీగా పేరు దక్కించుకున్నారు. ఇక ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఉంది అనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న వార్త. ఈ క్రమంలో ప్రస్తుతం రష్మిక మాటలూ కొని తెగ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ. అదే క్రమంలో మరొకవైపు రష్మిక మందన్న కూడా నేషనల్ క్రష్ అయిపోయింది. ఇద్దరు కూడా ఎవరికి వారు తమ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే కెరియర్ పరంగా ఎవరికి వారు బిజీగా ఉన్నా.. వ్యక్తిగతంగా మాత్రం ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు ఈ వార్తలకు ఆజ్యం పోసేలా రష్మిక, విజయ్ దేవరకొండ ప్రవర్తన కూడా అనిపిస్తోంది. ముఖ్యంగా ఇద్దరూ కలిసి వెకేషన్స్ కి వెళ్లడం, ఫెస్టివల్స్ వస్తే చాలు రష్మిక, విజయ్ దేవరకొండ ఇంట్లో కనిపించడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనికి తోడు ఇటీవల పుష్ప 2 సినిమాను విజయ్ దేవరకొండ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి రష్మిక చూసింది.
అలాగే విజయ్ దేవరకొండ కూడా అభిమానులతో తాను ఇంకా సింగిల్ గా ఉన్నానని అనుకుంటున్నారా? అని కూడా ప్రశ్నించాడు. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు..ఎక్కబోతున్నారని అందరికీ అర్ధం అవుతోంది. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తనకు చేసిన ఒక సహాయం గురించి చెప్పి ఎమోషనల్ అయింది. రష్మిక మాట్లాడుతూ.. పుష్ప 2 సినిమాలోని ఒక కీలక సన్నివేశం నాకు అర్థం కాలేదు. ఇక దానిని అర్థం చేసుకోవడం కోసం నేను విజయ్ కి ఫోన్ చేశాను. కానీ విజయ్ నాకు ఆ సీన్ పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాడు.
ఇక ఆయన చెప్పిన గైడెన్స్ తోనే ఆ సినిమాలో నటించాను.అయితే ఆ సినిమాలో నేను నటించిన ఆ సన్నివేశం తెరపై చూసినప్పుడు అభిమానులు చప్పట్లు, ఈలలతో కేరింతలు కొట్టారు. ఇక ఆ సమయం నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. విజయ్ దేవరకొండ తో ఈ విషయాన్ని వెంటనే చెప్పి ఏడ్చేసాను అంటూ రష్మిక తెలిపింది.
మొత్తానికైతే తన సీన్ బాగా పండడానికి విజయ్ దేవరకొండ సహాయం చేశాడని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.