Year Ender 2024: ఈ యేడాది ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ హీరోల సరసన చేరిన తేజ సజ్జ..

Year Ender 2024: 2024లో ఓ ప్రత్యేకత ఉంది. ఈ యేడాది విడుదలైన చిత్రాల్లో హనుమాన్ మూవీ సంక్రాంతి సీజన్ తో పాటు జనవరి నెలలో  విడుదలైన తెలుగు చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచింది. అటు జూన్ నెలలో కల్కి, సెప్టెంబర్ లో దేవర..తాజాగా ఈ యేడాది చివర్లో డిసెంబర్ లో  విడుదలైన పుష్ప 2 ఆయా నెలల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచాయి.

 

1 /13

ఒక రకంగా హనుమాన్ మూవీతో తేజ సజ్జ... 2024లో అటు ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల సరసన నిలిచారు. ఈ యేడాది విడుదలైన ఈ హీరోల చిత్రాలు ఆయా నెలల్లో తెలుగు సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచాయి.  

2 /13

జనవరి -హనుమాన్.. తేజ సజ్జ కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’ మూవీ. ఈ సినిమా జనవరి నెలలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.

3 /13

ఫిబ్రవరి - భీమ్లా నాయక్.. పవన్ కళ్యాణ్ హీరోగా రానా ప్రతినాయకుడిగా నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ చిత్రం ఫిబ్రవరి నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇప్పటికీ టాప్ లో నిలిచింది.

4 /13

మార్చి -ఆర్ఆర్ఆర్ (RRR).. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అజయ్ దేవ్ గణ్ మరో ముఖ్యపాత్రలో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ . ఈ సినిమా మార్చి నెలలో అత్యధిక వసూళ్లను రూ. 1300 కోట్ల గ్రాస్ వసూళ్లను  సాధించిన చిత్రంగా ఇప్పటికీ టాప్ లో ఉంది.

5 /13

ఏప్రిల్ - బాహుబలి 2 .. ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా ఏప్రిల్ నెలలో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రాల్లో టాప్ లో ఉంది. ఈ సినిమా రూ. 1818 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

6 /13

మే - సర్కారు వారి పాట.. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ పేట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ సినిమా మే నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇప్పటికీ టాప్ లో ఉంది.  

7 /13

జూన్ - కల్కి 2898 ఏడి.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం జూన్ నెలలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా టాప్ లో ఉంది.  అప్పటి వరకు ‘ఆదిపురుష్’ మూవీ టాప్ లో ఉండే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా  రూ. 1111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

8 /13

జూలై - బాహుబలి 1.. ప్రభాస్ కథానాయకుడిగా జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి పార్ట్ 1’. ఈ సినిమా జూలై నెలలో విడుదలైన చిత్రాల్లో టాప్ లో ఉంది.జూలై నెలలో విడుదలైన ఏ చిత్రాలు.. ఈ సినిమా రికార్డును ఏది ఇప్పటి వరకు బ్రేక్ చేయలేకపోయాయి.

9 /13

ఆగష్టు - సాహో.. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఈ సినిమా ఆగష్టులో విడుదలైన ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఇప్పటికీ టాప్ లో ఉంది.

10 /13

సెప్టెంబర్ - దేవర.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా సెప్టెంబర్ నెలలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లన సాధించిన టాప్ సినిమాగా నిలిచింది. 

11 /13

అక్టోబర్ - సైరా నరసింహారెడ్డి.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం అక్టోబర్ నెలలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా టాప్ లో నిలిచింది.

12 /13

నవంబర్ - ఢమరుకం.. అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ఢమరుకం’. ఈ సినిమా నవంబర్ నెలలో ఎక్కువ వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఇప్పటికీ టాప్ లో ఉంది. 2012 నుంచి ఈ సినిమా రికార్డును ఏ సినిమా బ్రేక్ చేయలేకపోతుంది

13 /13

డిసెంబర్ - పుష్ప 2 ది రూల్.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా డిసెంబర్ లో ఇప్పటి వరకు ‘సలార్’ మూవీ అత్యధిక వసూళ్లను రాబట్టిన రికార్డును ‘పుష్ప 2 ది రూల్’ మూవీ బ్రేక్ చేసింది.