Sobitha Dhulipala Akkineni: శోభితా దూళిపాళ్ల కాదు కాదు. శోభితా అక్కినేని.. అక్కినేని ఇంటి కోడలు అయ్యేంత వరకు ఆమె ఓ హీరోయిన్ మాత్రమే. కానీ ఎపుడైతే.. చైతూను పెళ్లి చేసుకోవడంతో శోభితా స్ట్రేచర్ అంతా మారిపోయింది. పెళ్లికి ముందు ఎలాంటి ఫోటో షూట్స్ చేసినా.. పెద్దగా పట్టించుకోని జనాలు.. ఇపుడు శోభిత చేసే ప్రతి అడుగును గమనిస్తుంటారు. మ్యారేజ్ తర్వాత తాజాగా ఫస్ట్ ఫోటో షూట్ తో మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Sobitha Dhulipala Akkineni:శోభితా తెలుగు అమ్మాయి అయినా.. ముందుగా బాలీవుడ్ లో లెగ్ పెట్టి అక్కడ హీరోయిన్ గా ప్రూవ్ చేసుకుంది. అంటే ముందుగా రచ్చ గెలిచి ఆ తర్వాత ఇంట గెలిచిందనే చెప్పాలి.
శోభితా ఈ నెల 4న అన్నపూర్ణ స్టూడియో అక్కినేని నాగేశ్వరావు మనవడు.. నాగార్జున కుమారుడైన నాగ చైతన్యను పెళ్లి జరిగింది. వివాహాం ముందు కొన్నేళ్లు ఈమె చైతూతో డేటింగ్ చేసినట్టు సమాచారం. ఇక మ్యారేజ్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన లాంఛనాలు ఇతరత్రా కలిసి ఈమె ఆస్తులు భారీగా పెరిగాయి.
పెళ్లికి ముందు శోభితా ధూళిపాళ్ల పెళ్లి తర్వాత శోభితా అక్కినేని అయింది. ఈమె తెలుగు సహా వివిధ భాషల్లో వరుస చిత్రాల్లో నటించి ఆడియన్స్ మనుసు దోచింది. అక్కడ కొన్ని చిత్రాల్లో హాట్ హాట్ గా నటించి సిల్వర్ స్క్రీన్ ను హీట్ పుట్టించింది.
శోభితా .. పదహారణాల అచ్చ తెలుగు ఆడపడుచు.. ముందుగా ఈమె మాతృ భాష తెలుగులో కాకుండా హిందీలో తెరకెక్కిన 'రమన్ రాఘవ్ 2.O' చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. బాలీవుడ్ సినిమాతో ప్రారంభమైన శోభిత కెరీర్.. ఆ తర్వాత తెలుగు, తమిళం,మలయాళంలో హీరోయిన్ గా తన లక్ పరీక్షించుకుంటుంది శోభితా.
తాజాగా ఈమె అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత మరోసారి తన ఫోటో షూట్ లో కనువిందు చేసింది. మరి పెళ్లి తర్వాత ఈమె గాగ్రా చోళిలో కనువిందు చేసింది. ఇక పెళ్లి తర్వాత ఈమె సినిమాలు చేస్తుందా లేదా అనేది చూడాలి. చైతూ మాత్రం తనకు ముగ్గురు పిల్లలు కావాలని రానాతో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు.
మరి శోభితా ఇపుడు సినిమాలకు బై బై చెబుతుందా లేకపోతే.. యథావిధిగా సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. అక్కినేని ఫ్యామిలీ స్టేటస్ చూస్తే.. శోభిత ప్రత్యేకంగా సినిమాలు చేయాల్సిన అవసరం అయితే లేదు. మరి వీళ్లికి సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ రేటుకు కొనుగోలు చేసింది.
ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కొంత మంది సెలబ్రిటీల మ్యారేజ్ వీడియోలను స్ట్రీమింగ్ చేస్తే ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. మరి వీరి వల్ల నెట్ ఫ్లిక్స్ ను చూసే ఆడియన్స్ పెరుగుతారా లేదా అనేది చూడాలి.