Shanidev Puja vidhan Tailabhishekam: చాలా మంది శనిదేవుడ్ని తైలంతో అభిషేకిస్తుంటారు. కానీ తైలాభిషేకం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు, పద్దతులు పాటించాలని పండితులు చెబుతుంటారు.
సాధారణంగా నవగ్రహాలలో శనీశ్వరుడు అత్యంత పవర్ ఫుల్ గ్రహంగా చెప్తుంటారు. ఆయన తల్చుకుంటూ..రాజును బికారీగాను.. బికారీని రాజుగాను చేసేస్తాడంటారు. శనీశ్వరుడు సూర్యుడు, ఛాయదేవీల సంతానం. ఈయన అగ్రజుడు యమ ధర్మరాజు. అయితే.. శనీశ్వరుడు ప్రతి ఒక్కరి జాతంలో వారు చేసుకున్న కర్మలను బట్టి పనిష్మెంట్ ఇస్తుంటాడు.
చాలా మంది శనీశ్వరుడు అంటే ఎంతో భయంకరమైన వాడని భావిస్తారు. కానీ.. ఆయన మనంచేసుకున్న కర్మలను బట్టి మాత్రమే.. ఫలితాలను ఇస్తుంటాడు. ఇతరులకు చెడు తలపెట్టేవారికి, చెడుకోరుకునే వారికి, చెడు చేసేవారికి, ఇతరులను చూసి ఓర్వలేక పోవడం వంటి గుణాల్ని కల్గి ఉన్నవాళ్లకు శనీదేవుడు చుక్కలు చూపిస్తాడంట.
అయితే.. శనీశ్వరుడు కలిప్రభావంతో.. తనకు ఉన్న బలంతో, వరాలతో చాలా గర్వానికి లోనౌతాడంట. అప్పుడు ఆంజనేయ స్వామిదగ్గరకు వెళ్లి తనతో యుద్దం చేయమని కోరుతాడంట. కానీ అప్పుడు హనుమయ్య..రామనామ పారాయణలో ఉంటారంట.
కానీ శనీశ్వరుడు మాత్రం.. హనుమ మీద ఆయుధాలతో దాడి చేసేందుకు ప్రయత్నిస్తాడంట. అప్పుడు.. హనుమ.. తన తోకతో.. శనీశ్వరుడ్ని పట్టుకని.. రెండు బండ రాళ్ల మధ్యన ఉంచి.. కొండకు అటు ఇటు.. తిప్పుతూ.. దెబ్బలు తగిలేలా చేస్తాడంట.
అప్పటికే శనీదేవుడి శరీరం అంతా రక్తసిక్త మౌతుందంట. అనేక గాయాలౌతాయంట. అప్పుడు.. శనీశ్వరుడు తన తప్పును తెలుసుకుని.. హనుమకు శరణు కోరుతాడంట. అప్పుడు హనుమంతుడు.. శనీదేవుడికి అభయమిస్తాడంట.
శనీశ్వరుడి బాధను చూడలేక హనుమంతుడు.. ఒక చెట్టునుంచి నూనెను తీసి రాసుకొవాల్సిందిగా ఆయనకు ఇస్తాడంట. శనీశ్వరుడు నూనెను రాసుకుని తన బాధల నుంచి విముక్తిని పొందాడంట. అందుకు అప్పటి నుంచి శనీకి ఎవరైతే నూనెను సమర్పిస్తారో.. అలాంటి వారి దోషాలను, బాధల్ని శనీశ్వరుడు దూరం చేస్తాడంట. హనుమంతుడ్ని కొలిచే వారికి కూడా శనీ బాధలు ఉండవని చెప్తుంటారు. అందుకే శనిదేవుడికి.. భక్తితో తైలాభిషేకం చేస్తుంటారు.