Samantha: సమంత అభిమానులు ఎగిరి గంతేసే వార్త.. కొత్త ఏడాదికి ముందే మరో గుడ్ న్యూస్ చెప్పేసిందిగా..!..

Samantha Ruth prabhu: సమంత అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ అని చెప్పుకొవచ్చు. కొన్ని రోజులుగా బాధలో ఉన్న సామ్ కు మాత్రం ఇది నిజంగా.. ఫుష్ ఖుషీ చేసిందని సోషల్ మీడియాలో రచ్చ నడుస్తొంది.

1 /6

సమంత ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలలో ఉంటున్నారు. అదేవిధంగా తాజాగా.. ఒక స్టార్ హీరో ఆమెకు లీగల్ నోటీసులు పంపించాడని కూడా వార్తలు జోరుగా ప్రచారం జరిగాయి. 

2 /6

ఈ  క్రమంలో సామ్ మాత్రం దీనిపై అధికారికంగా స్పందించలేదని తెలుస్తొంది. గతంలో సామ్.. తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్ట్ లు వేస్ట్ అయ్యాయని కూడా ఇన్ స్టాలో పోస్ట్ పెట్టారు. తన పెంపుడు కుక్క ప్రేమ కన్న.. తనకు ఏదీ ఎక్కువ కాదని కూడా కామెంట్లు చేశారు.

3 /6

అయితే.. తాజాగా, సమంత రక్త్ బ్రహ్మండ్ వెబ్ సిరిస్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలో ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ హీరో, హీరోయిన్ ల జాబితాను విడుదల చేసింది.  

4 /6

ఈ జాబితాలో... హీరో ప్రభాస్ తొలిస్థానంలో నిలవగా.. హీరోయిన్ లలో సమంత ఫస్ట్ ప్లేస్ లో నిలిచారంట. అంతేకాకుండా.. సమంత ఈ జాబితాలో వరుసగా మూడో సారి ఫస్ట్ స్థానంలో నిలిచారంట.

5 /6

అయితే.. గత రెండు నెలల్లో కూడా..ప్రభాస్, సామ్ లు కూడా ఇదే విధంగా ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. వీరి  తర్వాత.. 2.విజయ్, 3.అల్లు అర్జున్, 4.షారుఖ్ ఖాన్  5ఎన్టీఆర్ నిలిచారు.  

6 /6

హీరోయిన్లలో.. 2. ఆలియాభట్, 3. నయనతార, 4. సాయిపల్లవి, 5. దీపికా పదుకొణేలు వరుసగా తర్వాతి స్థానంలో నిలిచారు. అయితే.. ప్రస్తుతం సమంత అభిమానులు మాత్రం ఈ విషయం తెలిసి పండగ చేసుకుంటున్నారంట.