Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. క్రిస్మస్ పండగ వేళబంగారం ధర తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నేడు డిసెంబర్ 25వ తేదీ బుధవారం రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 వరకు తగ్గింది. బంగారం భారీగా తగ్గడానికి గల కారణాలేంటో చూద్దాం.
Gold Rate Today: క్రిస్మస్ పండగవేళ నేడు డిసెంబర్ 25వ తేదీ బుధువారం నాడు బంగారం ధర తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ.78,600కి చేరుకుంది. ఈ మేరకు ఆల్ ఇండియా బులియన్ అసోసియేషన్ వెల్లడించింది.
గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.78,700 వద్ద ముగిసింది. 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర బుధవారం రూ. 100 తగ్గి 10 గ్రాములకు రూ.78,200కి చేరుకుంది.
ప్రపంచవ్యాప్తంగా, Comex గోల్డ్ ఫ్యూచర్స్ 2,628 వద్ద ఉన్నాయి. ఔన్స్ $30 వద్ద స్థిరంగా ట్రేడవుతోంది. JM ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, EBG - కమోడిటీ & కరెన్సీ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణబ్ మెర్ మాట్లాడుతూ బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయని తెలిపారు. గత వారం క్షీణత తర్వాత రికవరీని చూశాయి, అయితే విదేశీ మార్కెట్‌లో డాలర్ విలువ భారీగా పెరుగుతుండటంతో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం అవుతున్నాయని తెలిపారు.
కమోడిటీస్, హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ ప్రకారం క్రిస్మస్ పండగ సందర్భంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. శుక్రవారం యూఎస్ డాలర్ లో రికవరీ కనిపించడంతో బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయని తెలిపారు.
మిరే అసెట్ షేర్‌ఖాన్ ఫండమెంటల్ కరెన్సీస్ అండ్ కమోడిటీస్ అసోసియేట్ వీపీ ప్రవీణ్ సింగ్ మాట్లాడుతూ ఇతర వస్తువుల మాదిరిగానే బంగారం ట్రేడింగ్ కూడా బలహీన లిక్విడిటీ పరిస్థితుల మధ్య కన్సాలిడేషన్ మోడ్‌లో ఉందని అన్నారు.
ఫిలడెల్ఫియా ఫెడ్ నాన్-మాన్యుఫ్యాక్చరింగ్, రిచ్‌మండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇండెక్స్‌లతో సహా యుఎస్ డేటా కోసం మార్కెట్ పార్టిసిపెంట్లు ఎదురుచూస్తున్నారని, ఇది బంగారం ధరలపై మరింత సంకేతాలను ఇస్తుందని ఆయన అన్నారు.
అయితే వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్ష పదవిని డొనాల్డ్ ట్రంప్ చేపట్టనున్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బంగారం ధరల్లో భారీ మార్పులు కనిపిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే డాలర్ విలువ నెమ్మదిగా పుంజుకుంటున్న వేళ బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపించకపోవడం వల్ల బంగారం ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు
అయితే భవిష్యత్తుల్లో మాత్రం బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.