Lord Shanidev: చాలా మంది శనీశ్వరుడ్ని ఎంతో భక్తితో పూజిస్తుంటారు. శనిదేవుడ్ని మందుడు, శనీశ్వరుడు అనికూడా పిలుస్తుంటారు. దీని వెనుకాల అనేక పురాణ కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
శనీశ్వరుడి సూర్యుడు, ఛాయదేవీ అమ్మవారి సంతానం. యమ్మధర్మరాజు శనీశ్వరుడికి సోదరుడు.అయితే.. శనీశ్వరుడ్ని కర్మ ప్రభువుఅని అంటారు. ఆయన మనం చేసుకున్న కర్మల్ని బట్టి ఫలితాలను ఇస్తుంటాడు.
చాలా మంది అసలు.. శనీశ్వరుడికి శనీ లేదా శనీశ్వరుడు అని పిలుస్తుంటారు.ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి శనిదేవుడు కైలాసంలో ఉన్న శివుడ్ని దర్శనంచేసుకునేందుకు వెళ్లాడంట. అప్పుడు శివుడు శనిదేవుడ్ని చూసి.. నువ్వు అందర్ని పట్టుకుని బాధిస్తావు. కానీ నన్ను మాత్రం నువ్వు ఏచేయలేవని అంటాడంట.
చాతనైతే నన్ను పట్టుకునేందుకు ఒకసారి అవకాశం ఇస్తాను. ప్రయత్నించు అని సవాల్ విసురుతారంట. శనిదేవుడ్ని శివయ్యను నమస్కరించి.. సరే.. మీరు అన్నట్లు రేపు ఉదయం వచ్చి మిమ్మల్ని పట్టుకుంటానని అంటాడంట. ఇంతలో శివుడు మాత్రం..తనను శనిదేవుడు పట్టుకుంటే.. అందరి ముందు చిన్న వాడ్ని అయిపోతానని భావించి.. శనికి చిక్కకుండా.. భూమి మీద ఒక బిల్వచెట్టు తొర్రలో శివుడు దాక్కుంటాడంట.
శని రెండో రోజున కైలాసం వెళ్లే వరకు అక్కడ శివుడు కన్పించడు. మరీ కాసేపటికి శివయ్య.. చూశావా.. నువ్వు నన్ను పట్టుకోలేవని చెప్పా కదా.. అన్నారంట. దీనికి శనీదేవుడు.. స్వామి నా ప్రభావం వల్ల..రాజు , దరిద్రుడు గాను.. దరిద్రుడు రాజుగాను మారిపోతారు..
కైలాసంలో ఉండే మీరు.. భూమి మీద చెట్టు తొర్రలో దాక్కొవడం నా ప్రభావం కాదా.. అని శివుడ్ని అడుగుతారంట. అప్పుడు శివయ్య.. జరిగింది.. గ్రహించి.. అప్పటి నుంచి శనీదేవుడ్ని .. శనీశ్వరుడు అని పిలుస్తాడంట.
ఆరోజు నుంచి శనిబాధలు తొలగాలంటే.. శివుడ్ని.. బిల్వపత్రాలతో శనీదేవుడ్ని పూజించిన కూడా.. శనిబాధలు ఉండవంట. అదే విధంగా శివుడి అవతారమే ఆంజనేయ స్వామిగా చెప్తుంటారు. అందుకే ఏలీనాటి శనిబాధలున్న వారు.. హనుమంతుడ్ని కూడా పూజిస్తుంటారు.