Tirumala vaikuunta Ekadashi 2025: నేడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశుని వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి ..అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు శాస్త్రోక్తంగా తెరిచారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీ వెంకటేశుని వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు నేటి నుంచి పది రోజులపాటు ఘనంగా నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీ వేంకటేశుని వైకుంఠ ద్వార దర్శనాలకు పది రోజులపాటు భక్తులకు కల్పించనున్నారు. నేటి నుంచి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం భక్తులకు లభిస్తుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు, స్వామివారికి స్వామివారికి చక్రస్నానం కూడా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో భక్తులకు టోకెన్లు కూడా విడుదల చేశారు.
నేడు జనవరి 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైకుంఠ ద్వారలు తెచ్చుకున్నాయి అర్చకులు స్వామికి పూజలు చేసి పుష్పార్చన, హారతితో వైకుంఠ ద్వారాలు తెరిచారు. ముఖ్యంగా ఉదయం నాలుగు గంటల నుంచి ప్రోటోకాల్ దర్శనాలు కూడా ప్రారంభమయ్యాయి.
అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు శాస్త్రోక్తంగా తెరిచారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు శ్రీశైలంలో కూడా ఉత్తర ద్వారం తెరిచారు. భక్తులకు స్వామివారిని ఉత్తరా ద్వారం ద్వారా తిలకించే భాగ్యం కలిగింది.. స్వామివారికి పుష్పార్చన కూడా నిర్వహించనున్నారు. తిరుమలలో భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం కల్పించేందుకు నిన్న టిటిడి యంత్రాంగం సమావేశం అయింది.
ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు కాబట్టి వాహనాల పార్కింగ్ ఇతర సదుపాయాలు కూడా కల్పించారు. అన్నప్రసాదం, పారిశుధ్యం వంటిపై కీలక ఆలయ ఈవో జారీ చేశారు. అదనంగా పోలీసుల భద్రత కూడా ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.
ఎనిమిదో తేదీ రాత్రి వైకుంఠ ద్వార దర్శనానికి టోకల్లో జారీ చేస్తున్న సమయంలో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు కలుగుకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆలయ ఈఓ శ్యామలారావు చెప్పారు.