అమరావతి: జేసీ దివాకర్ రెడ్డికి ( JC Diwakar Reddy ) షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇదివరకే ఏపీ రవాణా శాఖ అధికారులు జరిపిన దాడుల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి, ఆయన సోదరుడు జేసి ప్రభాకర్ రెడ్డిలకు ( JC Prabhakar Reddy ) చెందిన దివాకర్ ట్రావెల్స్ ( Diwakar Travels ) బస్సులలో అనుమతి లేకుండా నడుస్తూ పట్టుబడిన వాటిని సీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి రవాణా శాఖ అధికారుల దాడుల్లో జేసీ దివాకర్ రెడ్డికి చెందిన వాహనాలు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్టు తేలింది. బీస్-3 వాహనాలను.. బీఎస్-4 వాహనాలుగా మార్చి నడుపుతున్నట్టు అధికారుల సోదాల్లో నిర్ధారణ కావడంతో రవాణా శాఖ అధికారులు ఆ వాహనాలను సీజ్ చేశారు. ( JC Diwakar Reddy: ఏపీ సీఎంగా వైఎస్ భారతి : జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు )
పట్టుబడిన వాహానల్లో పలు వాహనాలను నాగాలాండ్‌తో పాటు పలు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు అధికారులు గుర్తించారు. గతంలోనే ఇలా 57 వాహనాలను సీజ్ చేసిన అధికారులు తాజాగా మరో 4 టిప్పర్లు సీజ్ చేశారు. మొత్తం 154 వాహనాలను అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించినట్లు సమాచారం ఉందంటున్న డీటీసీ శివరామ ప్రసాద్... త్వరలోనే మరిన్ని దాడులు జరిపి మిగతా వాహనాలను కూడా సీజ్ చేస్తామని చెబుతున్నారు. రవాణా శాఖ సోదాలకు చిక్కకుండా చాలా వాహనాలను రహస్య ప్రదేశాల్లో దాచినట్టు అనుమానిస్తున్న అధికారులు.. ఏదేమైనా నిబంధనలకు విరుద్దంగా నడిచే ఏ వాహనాన్నైనా పట్టుకుని సీజ్ చేస్తామని స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..