జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ !

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ ఇచ్చిన రవాణా శాఖ అధికారులు

Updated: Nov 14, 2019, 04:43 PM IST
జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ !
జేసి దివాకర్ రెడ్డి ఫైల్ ఫోటో

టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసి దివాకర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. జేసి దివాకర్ రెడ్డికి చెందిన మరో ఆరు బస్సులను రవాణ శాఖ అధికారులు సీజ్ చేశారు. గత పది రోజుల్లో జేసి బ్రదర్స్ కి చెందిన బస్సులను సీజ్ చేయడం ఇది రెండోసారి. బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నప్పుడు మొత్తం 36 బస్సులు సరైన డాక్యుమెంట్స్ లేకుండా తిరుగుతున్నట్టు గుర్తించారని.. అందులో జేసి బ్రదర్స్‌కి చెందిన బస్సులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 

ఇదిలావుంటే, ఇప్పటికే అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ తనను వారి పార్టీలో చేరాలని వేధిస్తోందని జేసి దివాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.