COVID-19 tests: ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి కరోనా

Osmania Medical college ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌లో 12 మందికి కరోనావైరస్ సోకినట్టు తెలుస్తుండటం ఆ కాలేజ్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 12 మంది విద్యార్థులకు కోవిడ్-19 పరీక్షల్లో ( Coronavirus tests ) పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే విద్యార్థులతో రద్దీగా ఉండే రీడింగ్ రూమ్‌ని మూసేసిన అధికారులు.. మిగతా విద్యార్థులకు కూడా కరోనావైరస్ టెస్ట్ చేస్తున్నారు.

Last Updated : Jun 2, 2020, 05:52 PM IST
COVID-19 tests: ఉస్మానియా మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌కి కరోనా

హైదరాబాద్: Osmania Medical college ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్‌లో 12 మందికి కరోనావైరస్ సోకినట్టు తెలుస్తుండటం ఆ కాలేజ్ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. 12 మంది విద్యార్థులకు కోవిడ్-19 పరీక్షల్లో ( Coronavirus tests ) పాజిటివ్ అని నిర్ధారణ అవడంతో వెంటనే విద్యార్థులతో రద్దీగా ఉండే రీడింగ్ రూమ్‌ని మూసేసిన అధికారులు.. మిగతా విద్యార్థులకు కూడా కరోనావైరస్ టెస్ట్ చేస్తున్నారు. అదే సమయంలో విద్యార్థులతో పాటు కాలేజ్ సిబ్బందిని సైతం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సంబంధిత అధికారులు ఆదేశించినట్టు తెలుస్తోంది. కరోనాపై పోరాటంలో జర్నలిస్టుల పాత్ర కీలకం.. టీఎస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు )

కరోనావైరస్ వ్యాప్తిని నివారించేందుకు అన్ని సాధారణ విద్యా సంస్థలను మూసేసినప్పటికీ... మెడికల్ కాలేజీ కావడంతో అత్యవసర వైద్య సేవల దృష్ట్యా మెడికల్ కాలేజ్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News