ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

AP Inter Supplementary Exam Time Table | ఆంధ్రప్రదేశ్‌లో ఇంర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీ విద్యాశాఖ విడుదల చేసింది. ఉదయం ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు.

Last Updated : Jun 16, 2020, 03:23 PM IST
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

AP Inter Supply Exam Date 2020 | ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ పరీక్షల ఫలితాలను ఇటీవల ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల టైం టేబుల్‌ (AP Inter Supply Exam Time Table)ను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది. జులై 11న ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జులై 18తో పరీక్షలు పూర్తవుతాయని, రెగ్యూలర్ పరీక్షలో తప్పిన విద్యార్థులు సప్లిమెంటరీకి సిద్ధంగా ఉండాలని ఏపీ ఇంటర్ బోర్డు సూచించింది.  ఏపీ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి

ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఒకేరోజు సప్లిమెంటరీ పరీక్షల (AP Inter Supply Exams 2020)ను నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 :30 వరకు సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.

 

సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించడానికి చివరి గడువు జూన్ 23 తేదీ కాగా, ప్రాక్టికల్ పరీక్షలు జులై 1 నుంచి 4వరకు నిర్వహించనున్నారు. అదే విధంగా జులై 5న నైతికత, మానవ విలువలు, జులై 6న పర్యావరణ విద్య (Environmental Studies Exam) పరీక్ష ఉంటుంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
మిస్ దివా విన్నర్, నటి ఫొటో గ్యాలరీ

Trending News