సురక్షితంగా లేని ప్రాంతాల్లో నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్ ( Ammonium nitrate ) నిల్వలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో బీరూట్ ( Beirut ) ఉదంతంతో తెలిసింది. ఇప్పుడు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నాచెన్నైలో అలా జరగవచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. మరి కస్టమ్స్ శాఖ ఏమంటోంది.
లెబనాన్ రాజధాని బీరూట్ ( Lebanon capital Beirut ) ఓడరేవులో నిల్వచేసిన అమ్మోనియం నైట్రేట్ పేలుడు ( Beirut blast ) సృష్టించిన విధ్వసం ఇంకా మర్చిపోలేదెవరూ. 135 మంది మృతి చెందగా...పలు ఇళ్లు, వీధులు నాశనమయ్యాయి. వేలాదిమందికి గాయాలయ్యాయి. ఇప్పుడు ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోతే చెన్నై కూడా మరో బీరూట్ కానుందనే వార్తలు ఎక్కువవుతున్నాయి. Also read: Sushant singh: రియా చక్రవర్తికు ఈడీ సమన్లు
బాణాసంచా, ఎరువుల తయారీలో ఉపయోగించే పేలుడు పదార్ధమైన అమ్మోనియం నైట్రేట్ ను 2015లో చెన్నై పోర్టులో ( chennai port ) కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మొత్తం 36 కంటెయినర్లుండగా..ఒక్కో కంటెయినర్ లో 20 టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంది. మొత్తం 740 మెట్రిక్ టన్నుల అమ్మోనియం నైట్రేట్ ఉంది. నిన్నటివరకూ ఈ వ్యవహారం కోర్టులో ఉండటం వల్ల ఇలాగే చెన్నై సమీపంలోని మనాలీలో ఉండిపోయింది ఏళ్ల తరబడి. బీరూట్ ఘటన నేపధ్యంలో ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. Also read: Heavy rains: 46 ఏళ్ల చరిత్రలో లేనంతగా ఒక్కరోజులో భారీవర్షం
స్థానికుల ఆందోళన, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేఫధ్యంలో కస్టమ్స్ శాఖ స్పందించింది. చెన్నై నగరానికి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనాలీలో ఈ అమ్మోనియం నైట్రేట్ నిల్వలు సేఫ్ కస్టడీలో ఉన్నాయని కస్టమ్స్ శాఖ ( Customs department ) ప్రకటించింది. ఈ నిల్వలున్న ప్రాంతానికి 2 కిలోమీటర్ల వరకూ నివాస ప్రాంతాలు లేవని..అన్నిజాగ్రత్తలు తీసుకున్నామని కస్టమ్స్ శాఖ వెల్లడించింది.
Chennai Customs seized 740 MTS imported ammonium nitrate. It is kept in safe custody at a Container Freight Station (CFS) in Manali, Chennai. It is located approx 20 km away from the city & there is no residential locality within 2km. All safety measures being taken: Customs Dept pic.twitter.com/ItmSuglaC8
— ANI (@ANI) August 6, 2020