India Coronavirus updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విజృంభిస్తోంది. గత కొన్నిరోజుల నుంచి నిత్యం 90 వేలకు పైగా కేసులు, 1100లకు పైగా మరణాలు నమోదవుతునే ఉన్నాయి. గత 24గంటల్లో శనివారం ( సెప్టెంబరు 19న ) దేశవ్యాప్తంగా ( India ) కొత్తగా.. 92,605 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 1,133 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాలతో.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 54,00,620 కి చేరగా.. మరణాల సంఖ్య 86,752 కి పెరిగింది. ఈ మేరకు ఆదివారం ఉదయం కేంద్ర వైద్యఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: MS Dhoni: అరుదైన ఘనత సాధించిన ఎంఎస్ ధోనీ
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10,10,824 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 43,03,044 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శనివారం దేశవ్యాప్తంగా 12,06,806 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 19 వరకు మొత్తం 6,36,61,060 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో దేశంలో కరోనా రికవరి రేటు 79.68 శాతం ఉండగా.. మరణాల రేటు 1.61 శాతం ఉంది. IPL 2020: రెచ్చిపోయిన అంబటి రాయుడు.. ఐపిఎల్ 2020 తొలి మ్యాచ్‌లో ధోనీ సేన విజయం
India: 54 లక్షలు దాటిన కరోనా కేసులు