ఫేస్ బుక్ లో ( Facebook ) ప్రస్తుతం కపుల్ ఛాలెంజ్ బాగా ట్రెండ్ అవుతోంది. ఈ ఛాలెంజ్ లో భాగం అవ్వడానికి చాలా మంది తమ సన్నిహితులు, జీవిత భాగస్వాములతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. దానికి #CoupleChallenge అనే హ్యాష్ ట్యాగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ బాగా పాపులర్ అవుతోంది. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఈ ఛాలెంజ్ లో భాగం అవుతున్నారు. అయితే ఈ హ్యాష్ ట్యాగ్ వల్ల గుర్తు తెలియని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.
ALSO READ| IPL 2020: ఐపీఎల్ లో ఎక్కువ సార్లు టీమ్స్ మార్చిన ప్లేయర్స్ వీరే
ఆలోచించండి..
ఇటీవలే పుణే పోలీసులు ( Police) సాధరణ ప్రజలకు కపుల్ ఛాలెంజ్ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. కపుల్ ఛాలెంజ్ లో మీరు పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ ఛాలెంజ్ మీకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.
సైబర్ ఎక్స్ పర్ట్స్ ప్రకారం కపుల్ ఛాలెంజ్ హ్యాష్ ట్యాగ్ వాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ వాడి మంది ఫోటోలను అపరిచితులు చూసే అవకాశం ఉంది. ఈ ఫోటోలను సైబర్ క్రిమినల్స్ తమకు నచ్చిన విధంగా వాడుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.
ALSO READ| Doppelgänger: మనుషులను పోలిన మనుషులు అంటాం కదా.. వీళ్లే వాళ్లు..
సైబర్ ఎక్స్ ఫర్ట్స్ ప్రకారం ఈ చిత్రాలను డౌన్ లోడ్ చేసి పార్న్ సైట్స్ లో వాడటం లేదా సైబర్ క్రైమ్ కోసం వినియోగించే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఛాలెంజ్ నుంచి దూరంగా ఉండటం మంచిది అని అంటున్నారు నిపుణులు. ఒక వేళ మీరు ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం సెట్టింగ్స్ లో ఆడియెన్స్ అనే అప్షన్ ను లోకి వెల్లి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అనే అప్షన్ ఎంచుకోండి. అయినా కూడా ఈ ఛాలెంజ్ ప్రమాదకరమే.
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR