/telugu/photo-gallery/rain-alert-expected-in-these-4-key-districts-of-telugu-states-imd-weather-alert-issued-rn-180901 AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక AP: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. ముఖ్యంగా ఆ 4 జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం.. ఐఎండి హెచ్చరిక 180901

భారత ఆల్‌రౌండర్ యూసఫ్ పఠాన్‌పై బీసీసీఐ కన్నెర్రజేసింది. ఐదు నెలలపాటు అతనిపై నిషేధం విధిస్తూ తాజాగా ప్రకటన జారీ చేసింది. గతేడాది మార్చి 16న టీ-20 మ్యాచ్‌లో పఠాన్ నిషేధిత ఉత్ప్రేరకాన్ని దగ్గు మందులో కలిపి తీసుకున్నందున యూసఫ్ పఠాన్ పై ఐదు నెలలు నిషేధం విధిస్తున్నట్లు ఝలక్ ఇచ్చింది. డోపింగ్ టెస్ట్‌లో పఠాన్ సఫలీకృతుడు కాలేదని పేర్కొంది.

యూసఫ్ తాను నిషేధిత పదార్థాన్ని తీసుకున్నానని ఒప్పుకున్నాడని చెప్పింది. పఠాన్  కూడా చేసిన తప్పును ఒప్పుకుంటూ... ఇది కావాలని చేసింది కాదని.. అనుకోకుండా ఆ ఉత్ప్రేరకం ఉన్న మందు తీసుకోవడం వల్ల అలా జరిగిందని బీసీసీఐకి తెలిపాడు. అతని వివరణపై బీసీసీఐ సంతృప్తి వ్యక్తం చేసి.. 5 నెలల పాటు నిషేధం విధించింది. గతేడాది యూసఫ్ పై డోపింగ్ ఆరోపణలు రావడంతో అతడిని బీసీసీఐ  తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. బరోడా క్రికెట్ అసోషియేషన్ కూడా అతడిని రంజీ ట్రోఫీలో ఆడనివ్వలేదు. అయితే ఈ నిషేధం గతేడాది ఆగస్టు నుంచే అమలులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి 14తో ఆ నిషేధం ముగుస్తుంది.

Section: 
English Title: 
BCCI SuspendsYusuf Pathan For Five Months
News Source: 
Home Title: 

యూసఫ్ పఠాన్ పై ఐదు నెలలపాటు నిషేధం

యూసఫ్ పఠాన్ పై ఐదు నెలలపాటు నిషేధం
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes