కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. కేంద్రీయ విద్యాలయాల్లో హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని వేసిన ఒక పిటీషన్ పై సుప్రీం కోర్టు స్పందించింది.

Last Updated : Jan 10, 2018, 07:51 PM IST
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. కేంద్రీయ విద్యాలయాల్లో హిందూమతాన్ని ప్రోత్సహిస్తున్నారని వేసిన ఒక పిటీషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్రీయ విద్యాలయాలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయని.. అలాంటి విద్యాలయాల్లో ఇలాంటివి జరగడం సబబు కాదని పలువురు వేసిన పిల్‌ వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీచేసి వివరణ ఇవ్వాల్సిందిగా కోరింది.

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో హిందీలో ప్రార్థన పాటలు పిల్లలచేత పాడిస్తున్నారని, ఆ విధంగా హిందూ మతాన్ని ప్రచారం చేస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని అనుమతించకూడదని పిల్‌లో పేర్కొన్నారు. ఈ కేసును అదే విద్యాలయాల్లో చదువుతున్న ఓ విద్యార్థి తండ్రి (న్యాయవాది) దాఖలు చేశారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. 

ఇది నిజంగా రాజ్యాంగబద్దమైన అంశమా? కాదా? అన్న విషయంపై సమీక్ష చేయాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. దేశంలోని 1100 కేంద్రీయ విద్యాలయాల్లో ఆలపించే హిందీ ప్రార్థనలు ఒక మతాన్ని ప్రోత్సహిస్తూ..  రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయా? అనేది పరిశీలిస్తామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. 

Trending News