UIDAI ప్రతీ ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి తన కార్డును లాక్ లేదా అన్ లాక్ చేసే సౌకర్యం కల్పిస్తోంది. అయితే మీరు మీ ఆధార్ కార్డు లాక్ చేయడానికి ముందు మీరు దాని వర్చువల్ ఐడి క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే ఆధార్ కార్డును లాక్ చేసిన తరువాత కేవైసి (KYC) ని ఫిల్ చేయడానికి మీకు వర్చువల్ ఐడి అవసరం చాలా ఉంటుంది. ఈ విధంగా మీ ఆధార్ కార్డను లాక్ లేదా అన్ లాక్ చేయవచ్చు.
దీని కోసం ముందుగా మీరు ఆధార్ కార్డు UIDAI పోర్టల్ https://resident.uidai.gov.in/ ను విజిట్ చేయండి.
అందులో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి ఆధార్ సర్వీసెస్ ( Aadhaar Services) అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
బయోమెట్రిక్ ప్రక్రియను పూర్తి చేసి.. వర్చువల్ ఐడీ వివరాలు ఎంటర్ చేయండి. ఒటీపీ క్యాప్చా ప్రాసెస్ తరువాత బయోమెట్రిక్ డాటాను అన్లాక్ చేసుకోవచ్చు.