విష ప్రయోగం చేశారంటూ ISRO Scientist Tapan Misra సంచలన ఆరోపణలు!

ISRO Scientist Tapan Misra: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మన దేశానికి తలమానికం. అలాంటి సంస్థలో సేవలు అందించడం అనేది శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం. అయితే ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2021, 11:48 AM IST
  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మన దేశానికి తలమానికం
  • ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు
  • తనపై మూడేళ్ల కిందట విష ప్రయోగం జరిగిందని ఆరోపించారు
విష ప్రయోగం చేశారంటూ ISRO Scientist Tapan Misra సంచలన ఆరోపణలు!

ISRO Scientist Tapan Misra: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మన దేశానికి తలమానికం. అలాంటి సంస్థలో సేవలు అందించడం అనేది శాస్త్రవేత్తల చిరకాల స్వప్నం. అయితే ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మూడేళ్ల కిందట విష ప్రయోగం జరిగిందని ఆరోపించారు. తనను అంతం చేసేందుకు కుట్ర జరిగిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని దర్యాప్తు చేపట్టాలని శాస్త్రవేత్త తపన్ మిశ్రా కోరారు.

ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తన ఫేస్‌బుక్ ద్వారా ‘లాంగ్ కెప్ట్ సీక్రెట్’ అంటూ ఈ సంచలన ఆరోపణలు చేసినట్లు పీటీఐ పేర్కొంది. 2017లో మే 23వ తేదీన తనపై అత్యంత ప్రమాదకరమైన ఆర్సెనిక్ ట్రైఆక్సైడ్‌ను ప్రయోగించారని సంచలన ఆరోపణలు చేశారు. ఇస్రో(ISRO) ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తనను హత్య చేసేందుకు కుట్ర జరిగిందని పోస్టులో తెలిపారు.

Also Read: షాకింగ్.. Pfizer Vaccine తీసుకున్న నర్సు హఠాన్మరణం

దోశ, చట్నీలో ప్రమాదకర పదార్ధాన్ని కలిపారని, అది తీసుకున్న తర్వాత నుంచి తన ఆరోగ్యం అంతగా సహకరించడం లేదని ఆరోపించారు. శ్వాస సంబంధిత సమస్యలతో పాటు న్యూరాలజీ సమస్యలు వేధించాయని, దద్దుర్లు సైతం వచ్చాయని.. వీటి నుంచి రెండేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. సమస్య నుంచి బయట పడేందుకు ఢిల్లీ(Delhi), ముంబై, అహ్మదాబాద్ ఆస్పత్రులలో చికిత్స పొందారు.

Also Read: Happy Birthday Kapil Dev: 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్.. ఆసక్తికర విషయాలు

మిలిటరీకి సంబంధించిన కీలక ప్రాజెక్టుల నుంచి తనను తప్పించడంలో భాగంగా కుట్ర జరిగిందన్నారు. పైగా తనపై జరిగిన విష ప్రయోగాన్ని ఎవరికీ చెప్పకూడదని బెదిరింపులు సైతం ఎదుర్కొన్నానని వెల్లడించారు. తనతో కొందరు బేరానికి వచ్చారని, అలాంటి వాటిని తిరస్కరించడంతో గతేడాది మరో విష ప్రయోగం జరిగిందని ఆరోపించారు. మానసిక స్థితి సరిగా లేని తన కుమారుడిని లక్ష్యంగా చేసుకుని వేధింపులు మొదలుపెట్టారని, దీనిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలని ఇస్రో సీనియర్ సైంటిస్ట్ తపన్ మిశ్రా కోరారు. 

Also Read: US Bans China Apps: చైనాకు షాకిచ్చిన అమెరికా...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News