Employees Provident Fund Deduction: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు తప్పనిసరి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) నెలవారీ వేతన పరిమితిని ప్రభుత్వం త్వరలో పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న రూ.15 వేలు పరిమితిని రూ. 21,000కు పెంచనున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఉద్యోగుల తప్పనిసరి ప్రావిడెంట్ ఫండ్(Provident Fund) కవరేజ్ నెలవారీ వేతన పరిమితిని పెంచడానికిగానూ కొంతకాలం నుంచి చర్చిస్తున్నారు.
కార్మిక మంత్రిత్వ శాఖ అధికారులు మరియు కార్పొరేట్ రంగ ప్రతినిధుల మధ్య బుధ, గురువారాల్లో దీనిపై చర్చించటానికి సమావేశం జరిగినట్లు జీ హిందుస్తాన్ రిపోర్టు తెలిపింది. అంతా అనుకున్నట్లే జరిగితే, డిమాండ్లు అంగీకరించినట్లయితే, ఈపీఎఫ్ఓ(Employees Provident Fund Organisation) నెలవారీ వేతన పరిమితిని త్వరలో పెంచనున్నారు.
Also Read: EPFO Benefits: ఈపీఎఫ్ ఖాతాదారులకు 5 బెనిఫిట్స్
అంతకుముందు, వారి ఉద్యోగానికి అనుగుణంగా వివిధ వర్గాల కార్మికులకు సెలవులు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్(Bhartiya Mazdoor Sangh) ప్రభుత్వాన్ని కోరింది. లేబర్ కోడ్స్ కొత్త నిబంధనలలో ప్రతిపాదించిన 240 రోజుల ఎర్న్డ్ లీవ్స్‌ను 300 రోజులకు పెంచాలని గత ఏడాది జనవరి నుంచి బీఎంఎస్ డిమాండ్ చేస్తోంది.
Also Read: SBI Alert: పాన్ కార్డ్ అప్డేట్ చేయకపోతే ఈ ట్రాన్సాక్షన్స్ చేయలేరు
సాంఘిక భద్రతా కోడ్, మరియు ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్ అనే రెండు కార్మిక అంశాలపై ముసాయిదా నిబంధనలపై మంగళవారం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో కార్మిక సంఘం ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు(EPF Latest Update) సహా మరికొన్ని డిమాండ్లు చేసింది.
కాగా, ఈ తప్పనిసరి ఉద్యోగుల భవిష్య నిధి(EPF) వేతన పరిమితిని 2014 సెప్టెంబర్ నుండి యథాతథంగా కొనసాగుతోంది. గతంలో ఉన్న రూ.6,500 నెల జీతం నుండి రూ .15,000కు పెంచుతూ 2014లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పుడు రిటైర్మెంట్ విభాగం - ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సామాజిక భద్రతా పథకాల కింద కవరేజ్ కోసం నెలకు రూ.25 వేల వరకు వేతన పరిమితిని ప్రతిపాదించడం తెలిసిందే.
Also Read: PPO: కేంద్రం శుభవార్త.. పెన్షన్ కోసం ఇక ఆ సమస్య ఉండదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook