మీరు బంగారం కొంటున్నారా? అయితే గురువారం వరకు వేచి ఉండటం మంచిది. ఫిబ్రవరి1న ఆర్థిక మంత్రి జైట్లీ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇది. 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.31,000 మార్కును దాటింది. బడ్జెట్ తరువాత ధరలు తగ్గుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బంగారం దిగుమతి పన్నుల్లో కోత విధించడం వల్ల అక్రమ పసిడి రవాణాకు చెక్ పెట్టవచ్చని.. దాంతో ధరలు అదుపులోకి వస్తాయని భారత బులియన్ మరియు జ్యూయలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ (ఐబిజెఎ) అభిప్రాయపడింది. ఈ బడ్జెట్ లో దిగుమతి సుంకాన్ని 2 నుంచి 4 శాతం వరకు తగ్గించే అవకాశం ఉందని ఐబిజెఎ వైస్ ప్రెసిడెంట్ సౌరబ్ గడ్గిల్ ఆశాభావం వ్యక్తంచేశారు. దిగుమతి సుంకాలను తగ్గిస్తే బంగారం ధరలు నియంత్రణలోకి వస్తాయని గాడ్గిల్ చెప్పారు.
ప్రస్తుతం ప్రభుత్వం బంగారంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని విధించింది. దీనివల్ల అక్రమ పసిడి రవాణా పెరిగింది. వ్యాపారులు కూడా పన్ను ఎగ్గొట్టేందుకు స్మగ్లింగ్ బంగారాన్నే కొంటున్నారు. కావున ప్రభుత్వం దిగుమతి సుంకం తో పాటు జీఎస్టీని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరారు.
బడ్జెట్ 2018: పసిడి ధరలు తగ్గనున్నాయ్ ..!