Telangana CM KCR: కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి(GHMC Mayor Gadwal Vijayalakshmi), డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, కార్పొరేటర్లు ప్రగతి భవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వారికి పలు విషయాలు వివరించారు.
‘ఇంత మంది కార్పొరేటర్లున్నారు. కానీ ఒక్కరికే మేయర్ గా అవకాశం దక్కుతుంది. మీలో మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు. కానీ అందరికీ ఇవ్వలేము. నా పరిస్థితుల్లో మీరున్నా అంతే చేయగలరు. అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి’ అని సీఎం కేసీఆర్(Telangana CM KCR) పిలుపునిచ్చారు.
విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరం అని పేర్కొన్నారు. మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్ గద్వాల విజయలక్ష్మి(Gadwal Vijayalakshmi), డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా రెడ్డి, నూతన కార్పొరేటర్లు పాటు పడాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
Also Read: GHMC Mayor Election 2021: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికలు, అన్ని పార్టీల కార్పొరేటర్లను వెంటాడుతున్న భయం!
కోట్లాది మందిలో కేవలం కొద్ది మందికి మాత్రమే సందర్భం కలిసి వచ్చి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందన్నారు. అది మాత్రమే గొప్ప విషయం కాదు అని, ప్రజా ప్రతినిధిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజా జీవితంలో మంచి పేరు తెచ్చుకోవడం గొప్ప విషయం అని సూచించారు
Also Read: GHMC Mayor 2021: జీహెచ్ఎంసీ మేయర్‌గా విజయలక్ష్మీ, MIMతో ఫలించిన TRS వ్యూహాలు
విభిన్న ప్రాంతాలు, విభిన్న సంస్కృతులకు చెందిన ప్రజలు నివాసముంటున్న హైదరాబాద్ నగరం అసలు సిసలైన విశ్వనగరంగా, మినీ ఇండియాగా భాసిల్లుతున్నదని, ఈ నగర వైభవాన్ని మరింత పెంచే విధంగా కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు పాటు పడాలని సీఎం శ్రీ కేసీఆర్ పిలుపునిచ్చారు. pic.twitter.com/d4oflNQenD
— Telangana CMO (@TelanganaCMO) February 11, 2021
‘పదవిలో ఉన్నవారు ఎంతో సంయమనంతో, సహనంతో, సాదాసీదాగా ఉండాలి. మీ దగ్గరికి వచ్చే వాళ్ల కులం, మతం చూడవద్దు. ప్రతీ ఒక్కరిని ఆదరించాలి. అక్కున చేర్చుకోవాలి. వారికి సరైన గౌరవం ఇవ్వాలి. వారు చెప్పేది ఓపిగ్గా వినాలి. చేతనైనంత సాయం చేయాలి. అబద్దాలు చెప్పవద్దు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో ప్రయత్నించాలి.
గల్లీ చిన్నది గరీబోళ్ల కథ పెద్దది అనే గోరటి వెంకన్న పాట వినండి. నేను వంద సార్లు విన్నా. అందులో బస్తీల్లో ఉండే పేదల కష్టాలు, గోసలున్నాయి. వాటిని అర్థం చేసుకోవాలి. మేయర్, కార్పొరేటర్లు బస్తీల్లో పర్యటించి వారి బాధలు అర్థం చేసుకోవాలి. పేదలను ఆదరించాలనేది ప్రధాన లక్ష్యం కావాలి’ అని సీఎం కేసీఆర్ వివరించారు.
Also Read: GHMC Mayor elections: TRS పార్టీది రాజకీయ వ్యభిచారం.. BJP నేతల ఘాటు వ్యాఖ్యలు
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, సురేష్ రెడ్డి, సంతోష్ కుమార్, మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
GHMC Mayor కావాల్సిన అర్హతలు చాలా మందికి ఉన్నాయి, కానీ పదవి ఒక్కరికే సాధ్యం: CM KCR
మేయర్ కావాల్సిన అర్హతలున్న వారు చాలా మంది ఉన్నారు
అర్థం చేసుకుని, అందరూ కలిసి కట్టుగా ఈ నగరాన్ని ముందుకు తీసుకుపోవాలి
కార్పొరేటర్లతో ప్రగతి భవన్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశం