Bajaj Pulsar 180 New look: బజాజ్ పల్సార్ 180 బైక్ అంటే యూత్‌కు క్రేజ్ ఎక్కువ. అందుకే కంపెనీ మరోసారి లాంచ్ చేసేందుకు నిర్ణయించింది. త్వరలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. బజాజ్ బల్సార్ కొత్త మోడల్లో అవుట్ లుక్‌పై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. కానీ ఇంజన్లో ఏ మార్పూ చేయలేదు. పాత మోడల్‌లానే కొత్త మోడల్ కూడా మార్కెట్లో పట్టు సాధిస్తుందని కంపెనీ భావిస్తోంది.
ప్రస్తుతానికి బజాబ్ పల్సార్ 180 కొత్త మోడల్ ఇంకా అధికారికంగా లాంచ్ కాలేదు. కానీ ఇండియన్ మార్కెట్లో దీని పోటీ TVS Apache RTR 180, Honda Hornet 2.0 బైక్స్ తో ఉంటుంది.
బజాస్ పల్సార్ 180 కొత్త మోడల్ లుక్‌లో మార్పుతో ...ధర కూడా మారింది. కొత్త మోడల్ ధర ముంబై షోరూమ్‌లో 1 లక్షా 4 వేల 768 రూపాయలుగా నిర్ణయించారు. పల్సార్ 180 ఎఫ్ తో పోలిస్తే పది వేలు తక్కువే ఇది. పాత మోడల్ ధర 1 లక్షా 14 వేల 3 రూపాయలు.
కొత్త పల్సార్ 180 లుక్‌లో మార్పు తప్ప..మరే మార్పు లేదు. ఇంజన్ విషయంలో సెమీ ఫేయర్డ్ మోడల్‌లానే ఉంది. అంతేకాకుండా కొత్త మోడల్ 2 రంగుల్లో లాంచ్ అవనుంది.
ఆటో ఎక్స్పర్ట్స్ విశ్లేషణ ప్రకారం బజాజ్ పల్సార్ 180 కొత్త మోడల్..పాత మోడల్‌తో పోలిస్తే పది కిలోల బరువు తక్కువుంటుంది. కొత్త పల్సార్ 180లో బల్బ్ ఇండికేటర్స్‌తో హాలోజన్ హెడ్‌ల్యాంప్ అమర్చారు.
ముంబాయిలోని ఒక డీలర్ షోరూమ్‌లో బజాజ్ పల్సార్ కొత్త మోడల్ ప్రదర్శించారు. అయితే కంపెనీ మాత్రం అధికారికంగా లాంచ్ ప్రకటన చేయలేదు. కానీ త్వరలోనే మార్కెట్లో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. బజాజ్ కంపెనీకు పల్సార్ 180 అనేది పాపులర్ మోడల్.