Dethadi Harika: హారిక ఎవరో నాకు తెలియదు, త్వరలో అంబాసిడర్ నియామకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Dethadi Harika: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా  దేత్తడి హారిక నియామకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆమె స్థానంలో మంచి సెలెబ్రిటీని త్వరలో నియమించనున్నట్టు ప్రకటించిన మంత్రి..అసలు దేత్తడి హారిక ఎవరో తెలియదంటూ సంచలనం రేపారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 10, 2021, 05:15 PM IST
Dethadi Harika: హారిక ఎవరో నాకు తెలియదు, త్వరలో అంబాసిడర్ నియామకం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Dethadi Harika: తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా  దేత్తడి హారిక నియామకంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఆమె స్థానంలో మంచి సెలెబ్రిటీని త్వరలో నియమించనున్నట్టు ప్రకటించిన మంత్రి..అసలు దేత్తడి హారిక ఎవరో తెలియదంటూ సంచలనం రేపారు.

బిగ్‌బాస్ సీజన్ 4 తెలుగు ఫేమ్ దేత్తడి హారిక(Dethadi Harika)ను తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌(Telangana Tourism Brand Ambassador)గా నియమించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వానికి, అధికారులకు తెలియకుండా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ నేరుగా నియామకం చేయడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనపై అధికారులు, సంబంధిత మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా దిద్దుబాటు చర్యలుగా అధికారిక వెబ్‌సైట్ నుంచి ఆమె నియామక వివరాల్ని తొలగించేశారు. అటు నెటిజన్లు సైతం దేత్తడి హారికను నియమించడంపై పెద్దఎత్తున విమర్శలు చేశారు. యూట్యూబర్‌ను, బిగ్‌బాస్ కంటెస్టెంట్‌ను ఎలా నియమిస్తారంటూ ప్రశ్నలు కురిపించారు. 

ఈ ఘటనపై ఇప్పుడు తాజాగా తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud)ఘాటుగానే స్పందించారు. హారిక నియామకంపై సీఎంవో లేదా అధికారులకు ఎటువంటి సమాచారం లేదన్నారు. తాను ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నానని..త్వరలోనే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని స్పష్టం చేశారు. ఈ నియామకం వెనుక ఎవరున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. త్వరలోనే తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా మంచి సెలెబ్రిటీని నియమిస్తానని స్ప,ష్టం చేశారు. అసలు తనకు దేత్తడి హారిక ఎవరో కూడా తెలియదన్నారు మంత్రి. 

Also read: BiggBoss Harika: హారికకు షాక్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, వెబ్‌సైట్ నుంచి తొలగింపు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News