Remdesivir Injections: రెమ్‌డెసివిర్ కేటాయింపులపై కేంద్రం తీరుపై మంత్రి ఈటెల విమర్శలు

Remdesivir Injections: ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రేగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ  వైఖరిపై తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పిస్తున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 22, 2021, 05:27 PM IST
Remdesivir Injections: రెమ్‌డెసివిర్ కేటాయింపులపై కేంద్రం తీరుపై మంత్రి ఈటెల విమర్శలు

Remdesivir Injections: ఆక్సిజన్ సరఫరా, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల కొరత నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం రేగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ  వైఖరిపై తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) పంజా విసురుతున్నట్టే తెలంగాణ(Telangana) లో కూడా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మరోవైపు రాష్ట్రంలో ఆక్సిజన్, బెడ్స్, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్ల ( Remdesivir Injections) కొరత తీవ్రమవుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ( Minister Etela Rajender) కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ( Central government) మండిపడ్డారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత ( Oxygen Shortage) ఏర్పడితే కేంద్రానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. కరోనా మొదటి వేవ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని..దేశంలో కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రారంభమై.. ప్రజలంతా భయంతో ఉన్నారని తెలిపారు. 4 లక్షల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లకు ఆర్డర్‌ ఇస్తే.. 21 వేల 5 వందల ఇంజక్షన్లు మాత్రమే రాష్ట్రానికి వచ్చాయని మంత్రి రాజేందర్ వెల్లడించారు. రెమ్‌డెసివిర్‌ ( Remdesivir) విషయంలో కేంద్రం షాక్‌ ఇచ్చిందన్నారు.

రాష్ట్ర అవసరాలకు తగ్గట్టు కరోనా ఇంజక్షన్ డోసులు లేనని మంత్రి తెలిపారు. ఇతర రాష్ట్రాల రోగులకు కూడా రాష్ట్రంలో చికిత్స అందుతోందన్నారు. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా కేటాయింపులపై మంత్రి ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను(Remdesivir Injections) కేంద్ర పరిధిలో తీసుకుని ఇలా వ్యవహరించడం బాధాకరమన్నారు. రాజకీయాలు పక్కనబెట్టి కేటాయింపులు చేయాలన్నారు. ఆక్సిజన్ ట్యాంకర్ల కొరత ఇబ్బందిగా మారిందన్నారు. 

Also read: Corona Positive Cases: తెలంగాణలో కరోనా కల్లోలం, కోవిడ్-19తో తాజాగా 23 మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News