Corona New Variant: కరోనా మహమ్మారి ఇప్పట్లో వీడేలా కన్పించడం లేదు. ఒకదాని తరువాత మరొక వేరియంట్లతో వస్తున్న వేవ్స్ ఆందోళన రేపుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త వేరియంట్..అన్నింటికంటే ప్రమాదకరంగా హెచ్చరికలు జారీ చేస్తోంది.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) నుంచి తేరుకోకముందే థర్డ్‌వేవ్ (Corona Third Wave)హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇప్పుడు కరోనా వైరస్ మ్యూటేషన్ తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. వైరస్ మ్యూటేషనే కేసులు విపరీతంగా పెరగడానికి కారణమని పరిశోధకులు వెల్లడించారు. డెల్టా వేరియంట్‌గా (Delta Variant) పిలుస్తున్న B.1.617.2 వేరియంట్ భారత్‌లో అత్యధిక ప్రభావం చూపిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఇండియాలో మరో కరోనా వైరస్ వేరియంట్‌ను పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)గుర్తించారు. ఈ వేరియంట్‌ను అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాల నుంచి B.1.1.28.2 వేరియంట్‌గా( B.1.1.28.2 Variant) గుర్తించారు.
ఎన్‌ఐవి నివేదిక ప్రకారం, బ్రెజిల్, యూకే నుంచి భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో ఈ కొత్త వేరియంట్‌ను కనుగొన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగించే అవకాశం ఉందని తమ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ వేరియంట్‌తో వైరస్ వ్యాప్తి మరింత అధికంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ వేరియంట్‌ను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న టీకాలు ఏ మేరకు సామర్థ్యాన్ని కల్టి ఉన్నాయనేది తెలుసుకునేందుకు మరింత లోతుగా పరీక్షించాల్సిన అవసరం ఉందని నివేదిక పేర్కొంది. కొత్త వేరియంట్‌ను (Corona New Variant) ప్రయోగించిన ఎలుకల్లో శరీర బరువు ఒక్క సారిగా తగ్గిపోయిందని పరిశోధకులు తెలిపారు. అంతేకాకుండా శ్వాసకోశంలో సమస్యలు, ఊపిరితిత్తుల్లో గాయాలు ఏర్పడాయని పేర్కొన్నారు.
Also read: IBPS RRB Notification 2021: 10,493 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్, నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook