Telangana Inter Colleges Reopen Today: నేటి నుంచి తెలంగాణలో కళాశాలలు ప్రారంభం కానున్నాయి. కరోనా కట్టడి చర్యలలో భాగంగా మే నెలలో విధించిన లాక్‌డౌన్ ఇటీవల పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో విద్యార్థుల చదువుపై టీఆర్ఎస్ సర్కార్ (TRS Govt) ఫోకస్ చేసింది.
ఈ క్రమంలో జూన్ 25 నుంచి కాలేజీలు తెరవనున్నట్లు ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది జూనియర్ కళాశాలలకు శుక్రవారం నుంచి హాజరు కావాలని ఆదేశాలలో పేర్కొంది. అయితే కళాశాలలకు వచ్చే సిబ్బంది కోవిడ్19 నిబంధనలు పాటించాలని సూచించింది. పాత ఫీజులతోనే కాలేజీలు కొనసాగింపు మొదలుకావాలని పేర్కొంది. ఈ నెల 30 లోపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రైవేట్ కాలేజీలకు Telangana ఇంటర్ బోర్డ్ స్పష్టం చేసింది.
Also Read: Medical Posts 2021: మెడికల్ కాలేజీలకు 7007 పోస్టులు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం
కరోనా వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది సైతం విద్యార్థులకు సిలబస్ సరిగా పూర్తికాలేదని, ఇవి వారి చదువుపై ప్రభావం చూపిస్తున్నాయిని ఇంటర్ బోర్డ్, తెలంగాణ ప్రభుత్వం భావించాయి. 15 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న కాలేజీ భవనాల్లో విపత్తు నిర్వహణ, అగ్నిమాపక విభాగం (Fire Department) నుండి నిరభ్యంతర పత్రం తప్పనిసరి తీసుకోవాలని సూచించింది. కరోనా సెకండ్ వేవ్ (CoronaVirus) తరువాత సాధ్యమైనంత త్వరగా విద్యార్థులకు తరగతులు ప్రారంభించి, సిలబస్ పూర్తి చేయాలని ఇంటర్ బోర్డ్ యోచిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook