ఈటల రాజేందర్‌ భాషపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

Minister Harish Rao comments on Etela Rajender: హైదరాబాద్: హుజురాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) ఈటల రాజేందర్ గెలుస్తే.. ఒక్క వ్యక్తిగా ఆయన మాత్రమే గెలుస్తాడు. మీరంతా ప్రజలుగా గెలుస్తారా ? లేక ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కేవలం ఒక వ్యక్తిగా గెలిపిస్తారా అనేది మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2021, 05:11 PM IST
  • ఈటల రాజేందర్ బీజేపీలో (BJP) చేరగానే కొత్త భాష నేర్చుకున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం.
  • నీలో అప్పుడే ఓటమి ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోందన్న హరీష్ రావు (Harish Rao)
  • ఈటల రాజేందర్ (Etela Rajender) నన్ను కూడా ఒరేయ్ హరీశ్ అని సంభోదిస్తున్నాడన్న మంత్రి హరీష్
ఈటల రాజేందర్‌ భాషపై మంత్రి హరీష్ రావు ఆగ్రహం

Minister Harish Rao comments on Etela Rajender: హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరగానే కొత్త భాష నేర్చుకున్నారని మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకాలం పాటు తనకు అన్నం పెట్టి, రాజకీయాల్లో అక్షరాలు నేర్పి, అవకాశాలు ఇచ్చి, ఇన్ని పదవులు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ను (CM KCR) పట్టుకుని ''రా'' అని సంబోధిస్తున్నాడని ఈటల రాజేందర్ వైఖరిపై అభ్యంతరం తెలిపారు. ఈటల రాజేందర్ నన్ను కూడా ఒరేయ్ హరీశ్ అని సంభోదిస్తున్నాడు. మేము నీలాగా కాదు. మాకు సంస్కారం ఉంది. మేము మాత్రం నిన్న రాజేందర్ గారూ అనే సంబోధిస్తాం అని అన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ మంత్రి హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటమి ఫ్రస్టేషన్ వల్లే దిగజారిన భాష
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ''ఆస్తులను రక్షించుకోవడం కోసమే వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో (BJP) చేరావు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓడిపోతానేమో అనే భయంతో అలా దిగజారి మాట్లాడుతున్నావు అని అర్థం అవుతోంది. నువ్వు అలా మాట్లాడుతున్నావంటే.. నీలో అప్పుడే ఓటమి ఫ్రస్టేషన్ స్పష్టంగా కనిపిస్తోందని తెలిసిపోతుంది'' అని అన్నారు.

Also read: Dalita Bandhu money: ‘దళిత బంధు' నిధులు విడుదల... ఎవరి అకౌంట్లో పడతాయో తెలుసా!

ఈటల రాజేందర్ గెలిస్తే.. మీరు ఓడిపోతారు
హుజురాబాద్ ఉప ఎన్నికలో (Huzurabad bypolls) ఈటల రాజేందర్ గెలుస్తే.. ఒక్క వ్యక్తిగా ఆయన మాత్రమే గెలుస్తాడు. ప్రజలుగా మీరంతా ఓడిపోతారు. మీరంతా ప్రజలుగా గెలుస్తారా ? లేక ఈటల రాజేందర్‌ను (Etela Rajender) కేవలం ఒక వ్యక్తిగా గెలిపిస్తారా అనేది మీరే తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మంత్రి హరీష్ రావు అభిప్రాయపడ్డారు. 

హుజురాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ వల్లే అభివృద్ధి చెందింది. ఆ అభివృద్ధి అలాగే కొనసాగాలంటే ఇక్కడి ప్రజలు టీఆర్ఎస్ పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మంత్రి హరీష్ రావు (Minister Harish Rao) పిలుపునిచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా టిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ (Gellu Srinivas Yadav) పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) ప్రకటించిన సంగతి తెలిసిందే.

Also read : Dalita Bandhu scheme: గుడ్ న్యూస్: 'దళితబంధు' అమలుకు కేసీఆర్ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.500 కోట్లు విడుదల

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News