Huzurabad Bypoll: టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ను ప్రకటించిన గులాబీ బాస్!

ఈటెలకు దీటుగా, తెరాస అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ యాదవ్ ను సీఎం కేసీఆర్‌ బుధవారం రోజున ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు అటు బీజేపీ పార్టీకి, ఇటు టీఆర్‌ఎస్‌ ముఖ్యం అవగా, యావత్ రాష్ట్రం ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తుంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 11, 2021, 02:35 PM IST
  • టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్‌
  • పాదయాత్రతో ఆకర్షిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటెల
  • ఇంకా అభ్యర్థిని ప్రకటించని కాంగ్రెస్
Huzurabad Bypoll: టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్‌ ను ప్రకటించిన గులాబీ బాస్!

Huzurabad bypoll: హుజురాబాద్‌ లో జరిగే ఉప ఎన్నికల్లో  తెరాస అభ్యర్థి ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. గులాబీ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (CM KCR) బుధవారం అధికారికంగా అభ్యర్థిని ప్రకటించటంతో తెరాస శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. 

టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే అంకితభావంతో పని చేస్తున్న తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి నాయకుడు, టిఆర్ఎస్వీ ప్రస్థుత విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌ (Gellu Srinivas) ను హుజురాబాద్ ఉప ఎన్నికల అభ్యర్థిగా సీఎం ప్రకరించారు. 

Also Read: గుడ్ న్యూస్: 'దళితబంధు' అమలుకు కేసీఆర్ సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌.. రూ.500 కోట్లు విడుదల

 

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ (Etela Rajender) రాజీనామాతో హుజురాబాద్ లో ఈ ఉప ఎన్నికలు అనివార్యమని అందరికి తెలిసిందే. బీజేపీ (BJP) తరపున ఈటెల అభ్యర్థిగా ఖరారు కాగా, కాంగ్రెస్ (Congress) ఇంకా అభ్యర్థి వేట కోసం కసరత్తు చేస్తూనే ఉంది. 
ఎత్తుగలలో ఆయా పార్టీలు ప్రణాళికలతో పాటు, అమలు చేసే పనిలో ఉన్నారు. ఇటు ఈటెల రాజేందర్ పాదయాత్ర మొదలు పెట్టి నియోజక వర్గం చుట్టేస్తుంటే, ఇటు టీఆర్ఎస్ పార్టీ వర్గాల వారీగా ఓటర్లకు గాలం వేస్తూ, తమవైపుకు తిప్పుకునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే వ్యూహా రచనలో, వాటిని అమలు పరచటంలో కాస్త వేగం పెంచిందని చెప్పాలి. 
గెల్లుశ్రీనివాస్ యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ (Osmania university) టిఆర్ఎస్వీ విభాగం అధ్యక్షుడుగా చేయటం, ఉద్యమ సమయంలో పలు మార్లు జైలుకు వెళ్ళటం వలన హుజురాబాద్ ఉప ఎన్నికల (Huzurabad bypoll) అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ లో సంబరాలు మొదలయ్యాయి. 
హుజురాబాద్ లో ఈ నెల 16 న తెరాస నిర్వహించే బహిరంగ సభలో గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను నియోజకవర్గ ప్రజలకు సీఎం పరిచయం చేయనున్నారు. ఉద్యమ నేపథ్యంతో పాటు సామాజిక సమీకరణాలు ఉన్నందున గెల్లుశ్రీనివాస్ యాదవ్ వైపు సీఎం కేసీర్ మొగ్గు చూపినట్టు  తెలుస్తుంది. 

Also Read: RBI కీలక నిర్ణయం: సామాన్యులే కాదు ఇకపై బ్యాంకులు కూడా జరిమానా కట్టాల్సిందే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News