Supreme Court: సుప్రీంకోర్టు నూతన న్యాయ‌మూర్తులుగా ఒకేసారి 9 మంది ప్ర‌మాణ స్వీకారం...తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

supreme court: సుప్రీంకోర్టులో కొత్త జడ్జీల ప్రమాణ స్వీకార కార్యక్రమం మంగళవారం జరిగింది. ఇటీవల నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణం చేయించారు. 

Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 31, 2021, 12:16 PM IST
  • ఇటీవలే కేంద్ర స‌ర్కారు గెజిట్ విడుద‌ల‌
  • సుప్రీంకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
  • 9 మంది జ‌డ్జిల‌తో ప్ర‌మాణం చేయించిన సీజేఐ
Supreme Court: సుప్రీంకోర్టు నూతన న్యాయ‌మూర్తులుగా ఒకేసారి 9 మంది ప్ర‌మాణ స్వీకారం...తొలిసారి ప్రత్యక్ష ప్రసారం

supreme court: సుప్రీంకోర్టుకు ఇటీవల నియమితులైన తొమ్మిది మంది న్యాయమూర్తులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. న్యాయస్థానం చరిత్రలో తొలిసారి న్యాయమూర్తుల ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం విశేషం. ఇప్పటివరకు రాష్ట్రపతి భవన్‌లో జరిగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం మాత్రమే ప్రత్యక్ష ప్రసారమయ్యేది. ఇప్పుడు తొలిసారిగా న్యాయమూర్తుల(Judges) బాధ్యతల స్వీకారం కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. అంతేగాక, ఒకేసారి 9 మంది న్యాయమూర్తులు ప్రమాణం చేయడం కూడా ఇదే మొదటిసారి.

సుప్రీంకోర్టు(supreme court)లో న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం(SC collegium) పంపిన 9 మంది పేర్లను ఇటీవల రాష్ట్రపతి(President) ఆమోదించిన విషయం తెలిసిందే. దీంతో నేడు వారంతా బాధ్యతలు స్వీకరించారు. కొత్త న్యాయమూర్తులతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ(NV Ramana)  ప్రమాణం చేయిస్తున్నారు. కరోనా(Corona) ప్రభావం కారణంగా ఈసారి ప్రమాణస్వీకార వేదికను మార్చారు. 1వ కోర్టు ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరగాల్సి ఉండగా..  అదనపు భవనం ఆడిటోరియానికి మార్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా భౌతిక దూరం పాటించాల్సి రావడంతో ఎక్కువ స్థలం కోసం అక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

Also Read: MK Stalin: పొగడ్తలు మానకపోతే చర్యలు తప్పవంటున్న ముఖ్యమంత్రి

ఇవాళ మొత్తం 9 మంది ప్రమాణస్వీకారం చేయగా.. ఇందులో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ బేలా త్రివేది సహా.. జస్టిస్‌ అభయ్‌ శ్రీనివాస్‌ ఓక్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ జె.కె.మహేశ్వరి, జస్టిస్‌ సీటీ రవికుమార్‌, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌, సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ నేడు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు. ఈ తొమ్మిది మందితో సుప్రీంకోర్టులో జడ్జీల(Judges) సంఖ్య 33కు చేరింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News