రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో గత కొంతకాలంగా టీడీపీ-బీజేపీ మధ్య గ్యాప్ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రులుగా చలామణి అవుతున్న బీజేపీకి చెందిన కామినేని, మాణిక్యాలరావు తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో వారు నిజంగా పదవులకు రాజీనామా చేస్తారా..లేదా ? అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. ఈ డిమాండ్లకు బీజేపీకి చెందిన మంత్రులు ఇప్పటి వరకు స్పందించలేదు. పైగా వారు టీడీపీ అధినేతకు టచ్ లో ఉంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వారి తాజా వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలు వారు రాజీనామా మంత్రి పదవికి చేస్తారా.. లేదంటే ఏకంగా బీజేపీకే గుడ్ బై చెప్పి టీడీపీలోకి జంప్ అవుతారా ..? అనే కోణంలో రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక వేళ బీజేపీ నేతలు కనుక మంత్రివర్గం నుంచి బయటికి వస్తే కేంద్ర మంత్రి వర్గంలో ఉన్న టీడీపీ నేతలు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరీ రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది.