పవన్ కల్యాణ్ పారితోషికం గురించి మహేష్ బాబు ఆరా ?

స్పైడర్ నేర్పిన పాఠాన్ని బాగా చదువుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్న ఓ ప్రచారంపై దృష్టిసారించినట్టు టాక్

Last Updated : Feb 25, 2018, 01:29 AM IST
పవన్ కల్యాణ్ పారితోషికం గురించి మహేష్ బాబు ఆరా ?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అను నేను సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. చివరిగా భారీ అంచనాల మధ్య వచ్చిన స్పైడర్ సినిమా డిజాష్టర్ అవడంతో ఎలాగైనా ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని మళ్లీ తన అభిమానులకు, తననే నమ్ముకున్న డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు ఆనందాన్ని పంచి ఇవ్వాలని భావిస్తున్న మహేష్ బాబు అందుకోసం భరత్ అను నేను సినిమాను ఇంకొంచెం కసితోనే చేస్తున్నాడు. స్పైడర్ సినిమానే కాదు.. ఏ సినిమా జయాపజయాలకైనా ఎన్నో కారణాలు దోహదపడతాయని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయితే, స్పైడర్ నేర్పిన పాఠాన్ని బాగా చదువుకున్న మహేష్ బాబు ప్రస్తుతం పవన్ కల్యాణ్ విషయంలో జరుగుతున్న ఓ ప్రచారంపై దృష్టిసారించినట్టు ఓ టాక్ వినిపిస్తోంది. 

అజ్ఞాతవాసి సినిమాతో ఆ సినిమాను కొనుగోలు చేసిన బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోవాల్సి రావడంతో పవర్ స్టార్ తాను సినిమా కోసం తీసుకున్న పారితోషికాన్ని తిరిగి ఇచ్చేసినట్టు జరుగుతున్న ప్రచారంపై మహేష్ బాబు దృష్టిసారించారనేది ఆ టాక్ సారాంశం. అసలు అజ్ఞాతవాసి నష్టపోయింది ఎంత ? ఏ నిష్పత్తిలో పవన్ తన పారితోషికాన్ని తిరిగి ఇచ్చేశారు అని ఆరా తీస్తున్నారట మహేష్ బాబు. అయితే, పవర్ స్టార్ ఏం చేస్తే, మహేష్ బాబుకి ఏం అవసరం వుంటుందంటున్న ఇంకొంతమంది.. ఈ ప్రచారంలో నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. 

Trending News