Omicron Variant: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని భయపెడుతోంది. దక్షిణాఫ్రికా నుంచి ప్రపంచమంతా చుట్టేందుకు ప్రయత్నిస్తోంది. అమెరికాలో నమోదైన తొలి కేసు ఇప్పుడు ఇండియాను వణికిస్తోంది.
కరోనా మహమ్మారి (Corona Pandemic)రూపం మార్చుకుని దాడి చేస్తోంది. భారత్‌లో సెకండ్ వేవ్‌లో విద్వంసం రేపిన డెల్టా వేరియంట్ కంటే అత్యంత ప్రమాదకరంగా ఒమిక్రాన్ వేరియంట్‌ను భావిస్తున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో 30 మ్యూటేషన్లతో తీవ్రంగా మారుతోంది. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్..ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 16 నుంచి 26 దేశాలకు విస్తరించింది. ఇప్పుడు కొత్తగా అగ్రరాజ్యం అమెరికాలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. ఇండియాను కలవరపెడుతోంది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ ఉందని గుర్తించినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు సౌదీ అరేబియా, యూఏఈలో కూడా ఒమిక్రాన్ తొలి కేసు నమోదైనట్టు సమాచారం. అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా దేశాలతో కలిపి ఒమిక్రాన్ సంక్రమణ దేశాల సంఖ్య 26కు పెరిగింది. ఒమిక్రాన్ కేసు వెలుగు చూడటంతో అమెరికా మరింతగా అప్రమత్తమైంది. కఠిన ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతోంది. అంతర్జాతీయ ప్రయాణీకులకు కోవిడ్ పరీక్షలు, ఇతర నిబంధనల్ని కఠినతరం చేయనుంది. అమెరికాకు(America notices first omicron case)వచ్చే ప్రయాణీకులు 72 గంటలు ముందు కాకుండా ఒకరోజు ముందు చేయించుకునేలా నిబంధనలు రానున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నా, తీసుకోకపోయినా కొత్త నిబంధనలు వర్తిస్తాయి. అటు కోవిడ్ పరీక్ష విధానంలో కూడా మార్పులు చేసేందుకు సీడీసీ ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ ప్రయాణాన్ని సురక్షితం చేసే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) భయం ఇప్పుడు ఇండియాను వెంటాడుతోంది. ఆఫ్రికా దేశాల్నించి ఇటీవల ఇండియాకు వచ్చిన చాలామంది ఆచూకీ అందుబాటులో లేకపోవడమే ఆందోళనకు కారణంగా ఉంది. పాస్‌పోర్ట్‌లో ఉన్న చిరునామాలో సంబంధిత వ్యక్తులు లేకపోవడమే దీనికి కారణంగా ఉంది. ఎందుకంటే గత 15 రోజుల్లే దాదాపు వేయిమందికి పైగా ముంబైకు చేరుకున్నారు. ఇందులో 466 మందిని గుర్తించారు. అటు బీహార్‌కు చేరున్న 281 మందిలో దాదాపు వందమంది కన్పించడం లేదు. ఆఫ్రికా దేశాల్నించి ఇండియాకు వచ్చినవారికి పూర్తి స్థాయిలో పరీక్షలు చేస్తేనే..ఒమిక్రాన్ వేరియంట్ సోకిందా లేదా అనేది తేలనుంది.
Also read: China 3lakh Super Soldiers: చైనా సైన్యంలోకి 3 లక్షల మంది సూపర్ సైనికులు.. భారత్‌తో యుద్ధం కోసమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook