Chinese President Xi Jinping war plan China makes 3 lakh super soldiers : ప్రపంచంలోనే ఇప్పటికే అతిపెద్ద సైన్యం చైనాకు ఉంది. అయినా చైనా ఇంకా సైనికులను పెంచుకునే పనిలో పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్న చైనా మరో 3 లక్షల మంది సూపర్ సైనికులను తయారు చేసుకుంటోంది. సరిహద్దులో తన బలాన్ని మరింత పెంచుకునేందుకే చైనా ఈ రిక్రూట్‌మెంట్ చేపడుతోంది. అయితే కొత్త యుద్ధాన్ని ప్రారంభించడానికే చైనా 3 లక్షల మంది సూపర్ సైనికులను ( 3 lakh super soldiers) తయారు చేస్తుందా అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. చైనా సైన్యంలో కొత్త నియామకాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో సైనిక బలం మరింత పెంచుకుని కొత్త యుద్ధానికి తెరలేపేందుకే ఈ కొత్త రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సాగుతుందని తెలుస్తోంది. ఇక ఈ సైన్యాన్ని రూపొందించడంలో షి జిన్‌పింగ్ (Xi Jinping) ప్రత్యేక శ్రద్ధ వహించారు. సైన్యానికి సంబంధించిన కాన్ఫరెన్స్ సందర్భంగా చైనా సైన్యంలో కొత్త రిక్రూట్‌మెంట్ కోసం సూచనలు ఇచ్చారు.
మొత్తానికి చైనా సూపర్ సైనికులను సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైంది. మూడు లక్షల మందిని సూపర్ సైనికులుగా రెడీ చేసి వారిని యుద్ధ సమయంలో ఉపయోగించుకోవాలని డిసైడ్ అయ్యింది చైనా. ఇటీవల జిన్‌పింగ్ (Jinping) మాట్లాడుతూ.. పోరాడి గెలవడం చైనా ఆర్మీ మొదటి.. చివరి లక్ష్యం కావాలని పేర్కొన్నారు. 2027 కల్లా చైనా నిర్దేశించుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటూ పిలుపునిచ్చారు. ఎందుకంటే ఆ సంవత్సరం చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (Chinese People's Liberation Army) శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఇక చైనా తన క్లెయిమ్ చేస్తోన్న ప్రాంతాలను 2027 నాటికి స్వాధీనం చేసుకునేందుకు కూడా ఇప్పటి నుంచే రక్షణ బలగాలు సిద్ధం చేసేందుకు తయారవుతోంది. అయితే చైనా సరిహద్దుల్లో (borders of China) కొత్తగా 3 లక్షల మంది చైనా సైనికులు మోహరిస్తే ఇది ఇతర దేశాలకు కాస్త ప్రమాదంగా కూడా మారే అవకాశం ఉంది. మన దేశంపై కూడా ఈ ప్రభావం ఉండే ఛాన్స్ ఉంది.
చైనా కేవలం కొత్త సైనికులను నియమించుకోవడమే కాదు... వారు ఆధునిక పద్ధతిలో పోరాడటానికి అన్ని రకాలుగా సంసిద్ధులను చేయనుంది. డోక్లామ్ (Doklam) యుద్ధం తర్వాత చైనా ప్రభుత్వం తన సైన్యాన్ని మరింత పటిష్టం చేసుకునే పనిలో పడింది. డోక్లాంలో దెబ్బ తిన్నప్పటి నుంచీ చైనా భారత్‌లో చొరబడేందుకు పలుమార్లు ప్రయత్నాలు సాగించింది. లద్దాఖ్ (Ladakh) నుంచి సిక్కిం, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలోకి చొరబడేందుకు చైనా సైన్యం అనేకసార్లు ప్రయత్నించినా ప్రతిసారీ మన సైన్యం చైనా ప్రయత్నాలను తిప్పి కొట్టింది. ఇక ఈసారి భారీ సైన్యంతో చైనా యుద్ధానికి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గాల్వాన్‌లో ఓటమితో చైనా మళ్లీ తన బలాన్ని చూపేందుకు ప్రయత్నిస్తోంది. 2020లో.. చైనా సైనికులకు గాల్వాన్‌లో గట్టి దెబ్బే తగిలింది. కానీ చైనా ఆ ఓటమిని అసలు జీర్ణించుకోవడం లేదు. ఆ గాయాలను పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంది. అందుకే సరిహద్దులో, ముఖ్యంగా ఎల్‌ఏసీలో (LoC) సైన్యాన్ని పటిష్టంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.చైనాకు మనదేశంతోనే కాకుండా మొత్తం 18 దేశాలతో సరిహద్దు వివాదం (Border dispute) ఉంది. భారత్, వియత్నాం, జపాన్, నేపాల్, ఉత్తర కొరియా, ఫిలిప్పీన్స్, రష్యా, సింగపూర్, దక్షిణ కొరియా, భూటాన్, తైవాన్, లావోస్, బ్రూనై, తజికిస్థాన్, కంబోడియా, ఇండోనేషియా, మలేషియా, మంగోలియాలతో చైనాకు సరిహద్దు వివాదాలు ఉన్నాయి.
Also Read : టాలీవుడ్‌లో వరుస మరణాలు.. మొన్న మాస్టర్,నిన్న సిరివెన్నెల,ఈ రోజు యంగ్ హీరో సోదరుడు
చైనా కొత్తగా ఎంత సైన్యాన్ని పెంపొందించుకున్నా.. భారత్ (India) కూడా అంతే దీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. భారత్, చైనాలకు సైనిక బలం ఎంతెంత ఉందో ఓసారి చూద్దాం..
గ్లోబల్ ఫైర్ పవర్ (Global Fire Power) నివేదిక ప్రకారం.. భారత్ రక్షణ బడ్జెట్ రూ.4 లక్షల 78 వేల కోట్లు కాగా, చైనా బడ్జెట్ రూ.15 లక్షల 74 వేల కోట్లు. అంటే చైనా రక్షణ బడ్జెట్ భారత్ రక్షణ బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువ. ఇక సైనికుల విషయానికి వస్తే.. భారత్‌లో 14 లక్షల 45 వేల మంది సైనికులున్నారు. చైనాలో 21 లక్షల 85 వేల మంది సైనికులు ఉన్నారు. భారతదేశంలో (India) 2119 విమానాలు ఉండగా.. చైనా వద్ద 3260 విమానాలు ఉన్నాయి. ఇక యుద్ధ విమానాల విషయానికి వస్తే... భారత్ వద్ద 542 మరియు చైనా వద్ద 1200 ఉన్నాయి. భారత్ వద్ద 775 హెలికాప్టర్లు ఉండగా..చైనా వద్ద 902 హెలికాప్టర్లు ఉన్నాయి. భారత్ వద్ద 4730 యుద్ధ ట్యాంకులుండగా.. చైనా (China) వద్ద 3205 ఉన్నాయి. అంటే ఈ విషయంలో చైనా కంటే భారత్ ముందుంది. భారత్‌లో 17 జలాంతర్గాములుండగా.. చైనా వద్ద 79 జలాంతర్గాములు ఉన్నాయి.
Also Read : Belly Dance Viral Video: బెల్లీ డ్యాన్స్ వైరల్.. ఓవర్ నైట్ సెలెబ్రిటీగా మారిన ఉత్తరాఖండ్ యువతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook