Bipin Rawat chopper crash : దట్టమైన పొగ మంచులోకి వెళ్లడం వల్లే బిపిన్‌ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందా?

Bipin Rawat's Helicopter enters in deep fog and hills : సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కొన్ని దృశ్యాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌‌.. దట్టమైన పొగమంచులోకి వెళ్లడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 9, 2021, 01:10 PM IST
  • భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ మృతిపై తీవ్ర విచారం
  • పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో వెళ్లిన ఎంఐ– 17 హెలికాప్టర్‌
  • వెలుగులోకి వచ్చిన దృశ్యాలు
Bipin Rawat chopper crash : దట్టమైన పొగ మంచులోకి వెళ్లడం వల్లే బిపిన్‌ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందా?

CDS General Bipin Rawat's death Bipin Rawat's Helicopter enters in deep fog and hills: తమిళనాడు (Tamil Nadu) కూనూర్‌ (Coonoor) సమీపంలో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో భారత చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్ మరణించిన విషయం తెలిసిందే. బిపిన్‌ రావత్ తో పాటు ఆయన భార్య మధులిక రావత్, (Madhulika) మరో 11 మంది ( 11 armed forces personnel) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటనతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. 

వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజ్‌లో ప్రసంగించేందుకు బిపిన్ రావత్‌ వెళ్తుండగా ఈ ఘోరం జరిగింది. బిపిన్‌ రావత్‌ (Chief of Defence Staff General Bipin Rawat) మరణంతో సైనిక దళాలతో పాటు దేశం మొత్తం తీవ్ర విచారంలో మునిగిపోయింది.

అయితే పొగమంచు పేరుకుపోయిన వాతావరణంలో ఎంఐ– 17వీ‌‌‌‌-5 హెలికాప్టర్‌ (Mi-17V-5chopper) ప్రమాదానికి గురైనట్లు.. దీంతో అందులో పయనిస్తున్న 13మంది మరణించారంటూ వైమానిక శాఖ ప్రకటించింది. శుక్రవారం వీరికి ఢిల్లీ కంటోన్మెంట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ ప్రమాదంలో గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆయనకు వెల్లింగ్టన్‌ మిలటరీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

మృతుల్లో బిపిన్ రావత్‌ తో పాటు ఆయన భార్య మధులిక బ్రిగేడియర్‌ ఎల్‌ఎస్‌ లిడ్డర్, లెఫ్టినెంట్‌ కల్నల్‌ హర్జీందర్‌‌సింగ్, వింగ్‌కమాండర్ పీఎఎస్‌చౌహాన్, స్క్వాడ్రన్‌ లీడర్‌‌ కె.సింగ్, నాయక్‌ జితేందర్‌‌కుమార్, నాయక్‌ గురుసేవక్‌ సింగ్‌, లాన్స్‌నాయక్‌ బి.సాయి తేజ, లాన్స్ నాయక్‌ వివేక్, హవల్దార్‌‌ సత్పాల్, దాస్, ప్రదీప్‌ ఉన్నారు.వీరిలో లాన్స్‌నాయక్‌ సాయితేజ ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాకు (Andhra Pradesh Chittoor District) చెందినవారు. బిపిన్‌ రావత్‌కు సాయి భద్రత అధికారిగా పని చేస్తున్నారు. 

Also Read : RRR Movie Trailer: అవతార్ ని మించిన యాక్షన్.. ప్రపంచ దృష్టిని టాలీవుడ్ వైపు తిప్పేసిన జక్కన్న

అయితే సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు కొన్ని దృశ్యాలు (Last moments of CDS Bipin Rawat Helicopter Crash) ఇప్పుడు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రమాదం చివరి క్షణంలో బిపిన్ రావత్ ప్రయాణిస్తోన్న హెలికాప్టర్‌‌.. దట్టమైన పొగమంచులోకి వెళ్లడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. తర్వాత కొన్ని క్షణాలకే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ దృశ్యాలను స్థానికులు వారి మొబైల్స్ లలో రికార్డు చేశారు. ఇప్పుడు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. దట్టమైన పొగ మంచులోకి వెళ్లడం వల్లే బిపిన్‌ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి గురైందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

 

Also Read : Helicopter Blackbox Found: ప్రమాద హెలీకాప్టర్‌లోని బ్లాక్‌బాక్స్ లభ్యం, వేగవంతమైన వి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News