BJP MLA Raja Singh: దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం..క్షమాపణ చెప్పాలని డిమాండ్..

BJP MLA Raja Singh: మ్యూజిక్ డైరెక్టర్  దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఖండించారు. వెంటనే దేవి.. హిందూవులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 18, 2021, 12:38 PM IST
BJP MLA Raja Singh: దేవిశ్రీ ప్రసాద్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే ఆగ్రహం..క్షమాపణ చెప్పాలని డిమాండ్..

BJP MLA Raja Singh: పుష్ప సినిమా(Pushpa Movie)లో సమంత చేసిన ‘ఊ అంటావా ఊహూ అంటావా’ సాంగ్ ఎంత పెద్ద స్థాయిలో హిట్ అయ్యిందో...అంతే స్థాయిలో వివాదాలు కూడా చుట్టిముట్టాయి. 'పుష్ప’  సినిమా ప్రమోషన్‌లలో భాగంగా.. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్(Devisri Prasad) చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఐటెం సాంగ్స్‌(item songs)ను భక్తి గీతాలతో పోలుస్తూ దేవి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

ఈ వివాదంపై తాజాగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA Raja Singh) కూడా స్పందించారు. దేవి చేసిన వ్యాఖ్యలతో హిందూవుల(Hindus) మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే దేవిశ్రీప్రసాద్ హిందూవులకు క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే ఆయన బయట తిరగలేరని  రాజాసింగ్ వార్నింగ్ ఇచ్చారు. పుష్ప సినిమా ఐటమ్ సాంగ్‌లో కొన్ని పదాలను దేవుడి శ్లోకాల(divotional songs)తో పోల్చటాన్ని రాజాసింగ్ ఖండించారు. 

Also Read: Allu Arjun: సమంత ఐటెం సాంగ్ పై అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News